Pawan Kalyan Gets Nagababu Support: ప్రధాని నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్‌పై ఉన్న గౌరవంతో ఆయన్ను మర్యాదపూర్వకంగా పిలిపించుకుని భేటీ అయితే.. ఆ భేటీ వివరాలను వెల్లడించాలని అధికార పార్టీ నేతలు డిమాండ్ చేయడం చూస్తోంటే.. వారిపై వారికి ఎంత అభద్రతా భావం ఉందో ఇట్టే అర్థమవుతోందని ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు అన్నారు. వైసీపీలో సామాజిక అంశాలపై కనీస అవగాహన లేని మంత్రులు ఉన్నారని.. వారికి స్క్రిప్టులు అందించినట్టుగానే పవన్ కళ్యాణ్ కి కూడా అందిస్తారని అనుకోవడం పొరపాటే అవుతుందని వైసీపీ నేతలను ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా.. ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడుతారు కానీ ఆయనకు ఎవ్వరి నుంచి స్క్రిప్టులు అవసరం లేదని మండిపడ్డారు. చంద్రబాబు, బీజేపి అందించే స్క్రిప్టులనే పవన్ కళ్యాణ్ చదువుతున్నారని వైసీపీ నేతలు చేస్తోన్న ఆరోపణలను తిప్పి కొడుతూ సోమవారం నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.     


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా ఏపీలో జగనన్న కాలనీలు పేరుతో జగన్ ప్రభుత్వం చేపట్టిన పథకంలో భారీ మొత్తంలో అవినీతి చోటుచేసుకుందని నాగబాబు ఆరోపించారు. జనసేన పార్టీ అధికారలోకి వచ్చాకా జె గ్యాంగ్ అవినీతి లెక్కలన్నీ బయటికి తీస్తామని.. ప్రస్తుతానికి జగనన్న కాలనీల పేరుతో జరిగిన అవీనితిని ప్రజల ముందుకు తీసుకొస్తున్నామంటూ సోమవారం నాగబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. 


జగనన్న కాలనీలు పేరిట భారీ ఎత్తున అవినీతికి తెరతీశారని ఆరోపించిన నాగబాబు.. అంశాల వారీగా పలు వివరాలు వెల్లడించారు. ఇళ్ల స్థలాలు లెవలింగ్ కోసం 5-7-2020 న రూ.2,631.70 కోట్ల నరేగా నిధులు మంజూరు చేయగా.. అందులో భారీ మొత్తంలో అవినీతి జరిగిందన్నారు. ఇళ్ల స్థలాల లెవలింగ్ కి అవసరమైన గ్రావెల్ ని సంబంధిత లే ఔట్లకు 5 కిమీ పరిధిలో నుంచే తరలించాలన్న కనీస నిబంధనను కాదని కాంట్రాక్టర్లకు అధిక లబ్ధి చేకూరేలా నిబంధనలను సవరించారని అన్నారు. మైనింగ్ శాఖ అనుమతులు లేకుండానే కేవలం తహశీల్దార్ అనుమతులతోనే జేసీబీలు, ట్రాక్టర్లు ఉపయోగించి గ్రావెల్ ని తరలించి అవినీతికి పాల్పడినట్టు నాగబాబు ఆరోపించారు.


జగనన్న కాలనీల నిర్మాణంలో భాగంగా తొలి విడత నిర్మించే ఇళ్ల కోసం అవసరమైన 3.10 లక్షల టన్నుల ఇసుకను ఉచితంగా సరఫరా చేయాల్సి ఉండగా.. వాస్తవానికి అలా జరగలేదు. దీంతో టన్ను ఇసుక రూ. 675 వెచ్చించి కొనుగోలు చేయాల్సి రావడంతో పాటు రవాణా ఖర్చులు కూడా కలిపి రూ. 3,100 కోట్ల అదనపు భారం పడిందన్నారు. అలాగే తొలి విడత గృహ నిర్మాణాలకు 7.44 లక్షల మెట్రిక్ టన్నుల ఇనుము అవసరం కాగా.. గతంలో రూ. 45 వేలకు లభించిన టన్ను ఇనుము ప్రస్తుతం 70 వేలకు పెరిగిందని.. ఫలితంగా లబ్ధిదారులపై 1860 కోట్ల రుపాయల అదనపు భారం పడుతోందని అన్నారు. 


ముఖ్యమంత్రి జగన్ సొంత కంపెనీ అయిన భారతి సిమెంట్స్ కి లబ్ధి చేకూరేలా మిగతా సిమెంట్ కంపెనీలతో కమ్మక్కయి ధరలు పెంచడం వల్ల లబ్ధిదారులు టన్నుకు రూ. 3 వేలు చొప్పున మొత్తం 2100 కోట్ల అదనపు భారం మోయాల్సి వస్తోందని అన్నారు. మొత్తంగా జగనన్న కాలనీల పేరుతో 13,690 కోట్ల అవినీతి జరగ్గా.. ఇళ్ల స్థలాల సేకరణ పేరుతో స్థానిక వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి మరో 1500 కోట్లు దోచుకున్నారని నాగబాబు ( Nagababu ) ఆరోపించారు.


Also Read : Krishna Passed Away: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం!


Also Read : Pawan Kalyan: ఉక్కు సంకల్పంతో ఎదుర్కొనే నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ.. పవన్ కళ్యాణ్ పొగడ్తల వర్షం


Also Read : Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో ప్రధాని మోదీ అందుకే భేటీ అయ్యారా ? జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ విశ్లేషణ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook