నాగార్జున సాగర్‌కి భారీగా వరద నీరు.. 21 గేట్లు ఎత్తిన అధికారులు
నాగార్జున సాగర్‌కి భారీగా వరద నీరు.. 21 గేట్లు ఎత్తిన అధికారులు
నల్గొండ: నాగార్జునసాగర్ డ్యామ్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీగా ఇన్‌ఫ్లో ఉండడంతో ప్రస్తుతానికి అధికారులు 21 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే, అన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో నాగార్జున సాగర్ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్‌కు భారీగా వరద నీరు రావడం 2009 తర్వాత ఇదే తొలిసారి కావడంతో సాగర్ నిండు కుండలా తొనికిసలాడుతూ కనిపిస్తోంది.
నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీరు 556 అడుగులకు చేరింది. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 223 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 8 లక్షల 25 వేల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. నాగార్జున సాగర్‌కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో క్రమక్రమంగా పర్యాటకుల రద్దీ పెరుగుతోంది.