Taraka Ratna in Yuvagalam నందమూరి హీరో తారకరత్నను కుప్పం హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాదయాత్రలో పాల్గొన్న ఆయన సొమ్మసిల్లి వాహనం పైనుంచి పడిపోయారు. దీంతో వెంటనే ఆయన్ను కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించారు. కుప్పం సమీపాన ఉన్న లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో బాలయ్య, తారకరత్న వంటి వారు పాల్గొన్నారు. కానీ ఇంతలోనే ఇలా జరగడంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్న వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఆ వెంటనే బాలయ్య కూడా హాస్పిటల్‌కు వెళ్లాడు. తారకరత్నకు ఇలా జరగడంతో నందమూరి అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అసలే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు లోకేష్‌ యువగళంలో తన వంతు సాయం చేసేందుకు వచ్చాడు. కానీ ఇలా మొదటి రోజే సొమ్మసిల్లి పడటం, తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో మున్ముందు తారకరత్న ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.


తారకరత్న చివరగా నటించిన 9 అవర్స్ వెబ్ సిరీస్‌ బాగానే హిట్ అయింది. అందులో తారకరత్న పోషించిన పోలీస్ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. తారకరత్న రకరకాల పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడైతే తారకరత్న రాజకీయంగా బిజీగా కానున్నాడు. తారకరత్న ప్రస్తుత పరిస్థితిపై వైద్యులు ఇంకా ఎలాంటి సమాచారాన్ని అధికారికంగా ప్రకటించలేదు.


Also Read:  jamuna death : టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటి జమున కన్నుమూత


Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి