హైదరాబాద్‌: కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ, నంది గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకులుగా పేరొందిన ప్రముఖ వ్యాపారవేత్త ఎస్పీవై రెడ్డి (68) ఇక లేరు. గత కొంత కాలంగా హుద్రోగ, కిడ్నీ సంబంధమైన సమస్యలతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ 3న హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కూడా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఎస్పీవై రెడ్డి పూర్తి పేరు సన్నపురెడ్డి పెద్ద ఎరుకల రెడ్డి. కానీ ఆయన అందరికీ ఎస్పీవై రెడ్డిగానే సుపరిచితులు. రాజకీయాలు, వ్యాపార రంగంలోనే కాకుండా తమ ప్రాంతంలో రైతులకు ఉచిత బోర్లు వేయించిన దాతగా, సొంతంగా వృద్ధాశ్రమాలు నిర్వహిస్తోన్న సామాజికవేత్తగా, ఎంతోమంది ఉపాధి కల్పించిన వ్యాపారవేత్తగా ఆయనకు మంచి పేరు ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఎస్పీవై రెడ్డి ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మరోసారి నంద్యాల ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున పోటీచేశారు. 1991లో బీజేపిలో చేరడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఎస్పీవై రెడ్డి అదే సంవత్సరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత 1999లో నంద్యాల, ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీ స్థానాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. 


2000 సంవత్సరంలో కాంగ్రెస్‌లో చేరి ఆ ఏడాది జరిగిన నంద్యాల పురపాలక సంఘం ఎన్నికల్లో చైర్మన్‌గా ఘన విజయం సాధించారు. అక్కడి నుంచి మొదలు ఆయన ఓటమి ఎరుగని రాజకీయ నేతగా ముందుగు సాగిపోయారు. 2004, 2009 లోక్ సభ ఎన్నికల్లో నంద్యాల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున పోటీచేసి గెలిచిన ఎస్పీవై రెడ్డి ఆ తర్వాత ఆ పార్టీని వీడి టీడిపిలో చేరారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో టీడీపి నంద్యాల ఎంపి టికెట్ కేటాయించకపోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. 


[[{"fid":"178213","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఒకింత అనారోగ్యానికి గురైన ఆయనను కుటుంబసభ్యులు ఏప్రిల్ 3న ఆస్పత్రిలో చేర్పించగా అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు. నంద్యాల నంది పైపుల పరిశ్రమ యజమానిగా పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్న ఎస్పీవై రెడ్డి ఆ తర్వాత అనేక ఇతర వ్యాపారాల్లోనూ విజయం సాధించి వెళ్లిన ప్రతీచోట తనదైన ముద్ర వేశారు.