Ycp Strategy: టీడీపీ యువనేత నారా లోకేశ్ చుట్టూ కేసులు చుట్టుముడుతున్నాయి. ఒకదాని తరువాత మరొక కేసు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అరెస్ట్ భయంతో పాదయాత్ర ప్రారంభించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. విచారణ రోజునే లోకేశ్‌ను కూడా అరెస్ చేసేందుకు సీఐడీ యోచిస్తోందా లేక వేరే వ్యూహముందా అనేది అంతుబట్టకుండా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు అతనిపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు, ఏపీ ఫైబర్ గ్రిడ్ వరుస కేసులున్నాయి. ఈ కేసుల్లో బెయిల్ కోసం లేక క్వాష్ కోసం చంద్రబాబు తరపు న్యాయవాదులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టు వ్యవహారాలతోనే సమయమంతా గడిచిపోతోంది.


మరోవైపు నారా లోకేశ్ చుట్టూ కేసులు అల్లుకుంటున్నాయి. ఏపీ ఫైబర్ గ్రిడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఇలా వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ జారీ చేసిన 41 ఏ నోటీసుల్ని సవాలు చేస్తూ లోకేశ్ వేసిన పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరగింది. మరోవైపు ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరుకావల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. అదే రోజు లోకేశ్ అరెస్ట్ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. 


అయితే వైసీపీ వ్యూహం మరోలా ఉందనే వాదన విన్పిస్తోంది. చంద్రబాబును వరుస కేసులతో బయటకు రాకుండా చేస్తూనే, లోకేశ్‌ను కేవలం కేసుల పేరుతో భయపెట్టే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. అంటే ఇప్పట్లో అతడిని అరెస్ట్ చేయకుండానే ఎప్పుడు అరెస్ట్ చేస్తారోనని భయపెట్టే ప్రయత్నాలు కొనసాగించవచ్చని తెలుస్తోంది.  అంటే లోకేశ్, చంద్రబాబు పార్టీ ప్రయత్నాలన్నీ రానున్న కాలంలో కేసులు, కోర్టుల చుట్టూ తిరిగేలా చేయాలనేది వైసీపీ వ్యూహంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే నెలరోజులుగా టీడీపీ పూర్తిగా చంద్రబాబు అండ్ లోకేశ్ కేసుల్లోనే మునిగిపోయింది. 


అంటే ఇప్పుడు వ్యూహం అంతా వైసీపీ అనుకున్నట్టుగానే జరుగుతోంది. నారా లోకేశ్‌కు కేసుల భయం పట్టుకుంటే టీడీపీ నేతలు ఆ కేసుల చుట్టూనే తిరుగుతున్నారు. పార్టీ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎన్నికలకు మరో ఆరు నెలలు ఉందనగా కేసుల భయంతో ఉక్కిరిబిక్కిరి చేయాలనే వైసీపీ వ్యూహం ప్రస్తుతానికి వర్కవుట్ అవుతున్నట్టు కన్పిస్తోంది. 


Also read: Pawan Kalyan Health: పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత.. జనవాణి మీటింగ్ అర్ధాంతరంగా ఆపేసి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook