Pawan Kalyan Health: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్న పార్టీ వర్గాలు తాజాగా వెల్లడించాయి. ప్రస్తుతం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వారాహి విజయ యాత్ర కొనసాగుతుంది. అందులో భాగంగా మంగళవారం జనసేన ఆధ్వర్యంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం నుంచి పనులు పూర్తి కాని వాటితో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను పవన్ కల్యాణ్ కు విన్నవించుకునే వీలును పార్టీ పెద్దలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. ప్రజల సమస్యలను తీరిగ్గా వింటున్న పవన్ కల్యాణ్ కు ప్రస్తుతం అస్వస్థత నెలకొంది. ఈ ప్రొగ్రామ్ జరుగుతున్న క్రమంలోనే అర్జీలు స్వీకరిస్తూ.. పవన్ కల్యాణ్ కు తీవ్ర వెన్నునొప్పికి గురయ్యారు. కొంతసేపు ఆగిన తర్వాత వెన్నునొప్పి ఎప్పటికీ తగ్గకపోవడంతో వెంటనే ఆయన ఆ కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు.
ఏం జరిగిందంటే?
హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'గబ్బర్ సింగ్' మూవీ షూటింగ్ టైంలో పవన్ కల్యాణ్ గాయపడ్డారు. అప్పటి నుంచి ఉన్న వెన్నునొప్పి ఇప్పటికీ బాధిస్తుందని ఆయన అనేకసార్లు చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికలకు ముందు ఇదే విధంగా తీవ్రమైన నొప్పికి గురైనట్లు అందరికీ తెలిసిన విషయమే. అయితే గత ఎన్నిక సమయంలో వెన్నునొప్పిని అశ్రద్ధ చేయడం వల్లే ఇప్పుడు అది మరింత పెరిగిందని పవన్ కల్యాణ్ ఇటీవలే చెప్పారు.
Also Read: Jio vs Airtel Fiber plans: జియో , ఎయిర్‌టెల్ ఎయిర్ ఫైబర్ ప్లాన్స్ వివరాలు ఇవే
అయితే పవన్ కల్యాణ్ పరిస్థితిని గమనించిన వైద్యులు సర్జరీ చేయించుకోవాల్సిందిగా సూచించారు. కానీ, సంప్రదాయ వైద్యంపై ఆయనకి ఉన్న నమ్మకంతో అదే దిశగా అడుగులు వేశారు. వెన్నునొప్పి కోసం సంప్రదాయ వైద్యాన్ని తీసుకుంటున్న పవన్.. మళ్లీ గత కొన్ని రోజులుగా తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అయితే ఈ విషయంపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన నటుడు, నాయకుడు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతుడడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వెన్నునొప్పి కారణంగా వారాహి విజయ యాత్ర కొనసాగిస్తారా? లేదా అనే విషయాలపై సందిగ్ధత నెలకొంది.
Also Read: Quash Petition: చంద్రబాబు క్వాష్ పిటీషన్ విచారణ వాయిదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook