Anantapuram to Amaravati: ఆంధ్రప్రదేశ్ శాసనరాజధాని అమరావతికి కనెక్టివిటీ పెరగనుంది. రాయలసీమ నుంచి అమరావతిని కలుపుతూ నాలుగు లైన్ల రహదారికి ఆమోదం లభించింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాయలసీమ నుంచి  గుంటూరు వరకూ అంటే అమరావతిని కలుపుతూ ఎక్స్‌‌ప్రెస్ హైవే (Express Highway)కోసం ఎన్‌హెచ్‌ఏఐ (NHAI)గతంలోనే ప్రతిపాదించినా అటవీ భూముల్ని సేకరించాల్సి రావడంతో కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి నిరాకరించింది. ఫలితంగా రాయలసీమను అమరావతికి కలిపే ప్రతిపాదన ఆగిపోయింది. దాంతో రాయలసీమను అమరావతితో కలిపే ప్రత్యామ్నాయ మార్గాల్ని అణ్వేషించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) సమీక్షించారు. అనంతపురం-అమరావతి అనుసంధానం కోసం ప్రత్యామ్నాయం కోసం రహదారి నిర్మాణ ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలోని ప్రధాన పట్టణాల్ని అనుసంధానిస్తూ ప్రణాళిక రూపొందించింది ఏపీ ప్రభుత్వం(Ap government). ఇప్పటికే ప్రకాశం జిల్లా గిద్దలూరు-ప్రకాశం జిల్లా వినుకొండ మధ్య రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. దీని ఆధారంగా అనంతపురం-గుంటూరు మధ్య నాలుగు లైన్ల రహదారి నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు ప్రతిపాదనలు పంపింది.


417 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి 544 నిర్మాణానికి ఆమోదం లభించింది. ఈ రహదారి పూర్తయితే శాసన రాజధాని అమరావతికి రాయలసీమకు మధ్య కనెక్టివిటీ పెరగనుంది. రాయలసీమ ప్రజలకు అమరావతి అందుబాటులో రానుంది. నాలుగు ప్యాకేజీలుగా 9 వేలకోట్లతో రహదారి నిర్మాణం జరగనుంది. 


Also read: Covid Vaccination: ఏపీలో ఇవాళ్టి నుంచి 18 ఏళ్లు దాటినవారికి సైతం వ్యాక్సినేషన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook