`నవయుగ`కే పోలవరం కాంట్రాక్టు
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంక్రీట్, మట్టి పనుల నిర్వహణా బాధ్యతలను నవయుగ కంపెనీకి అప్పగిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంక్రీట్, మట్టి పనుల నిర్వహణా బాధ్యతలను నవయుగ కంపెనీకి అప్పగిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై మంత్రివర్గ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ నుండి కాంక్రీట్ పనులను వేరే చేస్తూ, నవయుగ యుగ కంపెనీకి ఆ బాధ్యత అప్పగించనున్నట్లు తెలిపింది. ఈ కాంట్రాక్టు విలువ దాదాపు 1400 కోట్ల పైమాటే అని సమాచారం. గతంలో ఇవే పనులలో పురోగతి చూపించని కారణంగా ట్రాన్స్‌ట్రాయ్‌కి సీఎం నోటీసులు కూడా అందించారు. ఈ క్రమంలో ఈ పనులను పాతధరలకే చేయడానికి ముందుకొచ్చిన నవయుగ కంపెనీకే కాంట్రాక్టు ఇస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం ఇదే ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ పనులను కూడా నవయుగ కంపెనీయే చూస్తుండడం గమనార్హం