నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని టెంపో వాహనం వేగంగా ఢీకొట్టడంతో దామరమడుగు జాతీయ రహదారిపై విషాదం చోటుచేసుకుంది. దైవదర్శనానికి వెళ్లొస్తుండగా ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. అనంతరం తమ స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం నెల్లూరు జిల్లా(Nellore District) బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు.. మొత్తం ఎనిమిది మంది మృతిచెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 


Also Read: Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 28, 2021, ఓ రాశివారికి ధనలాభం


తొలుత ఘటనా స్థలంలోనే ఏడుగురు చనిపోగా, ఆసుపత్రికిక తరలిస్తుండగా మరొకరు ప్రాణాలొదిలారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. టెంపో డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం ఈ ప్రమాదాని(Road Accident)కి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. 


కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులోని పెరంబుదూర్‌కు చెందిన కొందరు శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. శ్రీశైలం నుంచి టెంపోలో బయలుదేరి నెల్లూరు చేరుకుని, అక్కడ పినాకినీ ఎక్స్‌ప్రెస్ రైళ్లో తమ స్వస్థలానికి చేరుకోవాలని భావించారు. కానీ కొన్ని గంటల్లో రైల్వేస్టేషన్ చేరుకుంటామనగా ఊహించని దుర్ఘటన చోటుచేసుకుంది.


Also Read: Gold Price Today 28 March 2021: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు, దిగొచ్చిన వెండి ధరలు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook