Collision Between Truck And SUV Car On National Highway 31: నిత్యం ఏదో ఓ చోట రోడ్లు రక్తమోడుతూనే ఉన్నాయి. అతివేగం, నిర్లక్ష్యం కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మంగళవారం ఉదయం బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్యాసింజర్ ట్రక్, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు.
బిహార్ పోలీసుల కథనం ప్రకారం.. పది మంది వ్యక్తులు ఓ ట్రక్కులో పూర్ణియా నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో కతిహార్ జిల్లాలోని కుర్షేలా సమీపంలో వీరి వాహనం ఓ యస్‌యూవీ కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటన 31వ జాతీయ రహదారిపై జరిగింది. ఈ రోడ్డు ప్రమాదం(Road Accident)లో అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం చెందారు.
Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం ధరలు, పసిడికి భిన్నంగా Silver Price
గాయపడ్డ కొందర్ని ఆసుపత్రికి తరలించగా, కొంత సమయానికే ముగ్గురు చనిపోయారు. అయితే మరో ఇద్దరు సైతం చనిపోయారని తాజాగా సమాచారం అందించింది. మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న బిహార్(Bihar) కతిహార్ జిల్లా పోలీసులు ట్రక్కును సీజ్ చేశారు. చనిపోయినవారంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్‌యూవీ డ్రైవర్ పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది. ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook