Mla Sridhar Reddy Sensational Comments: నెల్లూరు రూరల్ అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని ఆరోపించారు. తన ఫోన్ 3 నెలల నుంచి ట్యాప్ చేస్తున్నారని.. ఈ విషయం తనకు ముందే తెలుసని అన్నారు. రహస్యాలు మాట్లాడుకునేందుకు వేరే ఫోన్.. 12 సిమ్‌లు ఉన్నాయని చెప్పారు. ఫేస్ టైమర్, టెలిగ్రాం కాల్స్‌ని మీ పెగాసస్ రికార్డు చేయలేదంటూ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తనపై ముగ్గురు అధికారులతో నిఘా అవసరమా..? అని నిలదీశారు. నిఘా కోసం తన నియోజకవర్గంలో ఒక ఐపీఎస్ అధికారిని పెట్టుకోండంటూ ఫైర్ అయ్యారు. క్రికెట్ బెట్టింగ్ కేసులప్పుడు కూడా అప్పటి ఎస్పీ తనపై నిఘా పెట్టారని గుర్తుచేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాప్ చేశారంటూ ఆరోపించడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. గత కొంత కాలంగా కోటంరెడ్డి పార్టీపై అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించగా.. సమీకరణల్లో అధిష్టానం సర్దుబాటు చేయలేకపోయింది. నెల్లూరు జిల్లా నుంచి తనకు ఇవ్వకుండా కాకాణి గోవర్థన్ రెడ్డికి ఇవ్వడంతో కోటంరెడ్డి గుర్రుగా ఉన్నారు. అప్పటి నుంచి సొంతపార్టీ నాయకులతోపాటు అధికారులపై కూడా ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు.


గతంలో నెల్లూరు రూరల్‌లో 2,700 పెన్షన్లు తొలగించడంపై ఆయన బహిరంగంగానే తన అభ్యంతరం వ్యక్తంచేశారు. అదేవిధంగా ఐఏఎస్ అధికారి రావత్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా తన నియోజకవర్గంలో మురుగునీటి కాలువ సమస్యపై కోటంరెడ్డి చేపట్టిన నిరసన రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. స్వయంగా ఆయన కాలువలోకి దిగి నడుములోతు మురికినీళ్లలో నుంచి నిరసన తెలిపిన విషయం తెలిసిందే.  


'నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు అనేకం చేశాం. రాజకీయ కార్యకర్తగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా కార్యక్రమాలు చేస్తున్నాం. గడపగడపకి కార్యక్రమాన్ని రాష్ట్రానికి పరిచయం చేసింది రూరల్ నియోజకవర్గం. రాజకీయ కార్యకర్త తెల్లచొక్కా వెనుక కన్నీటి కష్టం ఉంటుంది. వారి కన్నీటి శాపం నాయకుడికి తగులుతుంది. వారి సమస్యల పరిష్కారం కోసం నేను నా కార్యకర్త కార్యక్రమం చేశాం. 


ఆరోగ్యరక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పేద, మధ్య తరగతి ప్రజల కోసం అనేక ప్రాంతాల్లో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. వచ్చే నెల నుంచి నియోజకవర్గంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. అవసరం అయిన వారికి ఆపరేషన్లు చేయిస్తాం. గుండె, కంటి, గర్భసంచి మొదలగు ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తాం. 6 కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యాలతో మాట్లాడాను. 33 మంది నిపుణులైన డాక్టర్లు సహకరిస్తున్నారు. 


రెండు స్వచ్చంద సంస్థలు కూడా ముందుకు వచ్చాయి, మరికొంతమంది స్నేహితులు ముందుకు వచ్చారు. వీరందరి సహాయసహకారాలతో, ఆరోగ్య శ్రీ సహకారంతో ఈ ఆపరేషన్లు నిర్వహిస్తాం. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నాం. పార్టీ జెండా, అజెండాలు ఎన్నికలప్పుడే. ప్రతిఒక్కరు బాగస్వామ్యులు అయ్యి, పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..' అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.  


Also Read: David Warner: పఠాన్ లుక్‌లో అదగొట్టిన డేవిడ్ వార్నర్.. ఆస్కార్ గ్యారంటీ  


Also Read: India Post Office Recruitment 2023: పోస్టల్ శాఖలో 40 వేల ఉద్యోగాలు.. టెన్త్ అర్హత.. డైరెక్ట్ జాబ్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి