AP Local Elections: మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు షురూ
AP Local Elections: ఏపీలో మరోసారి ఎన్నికల భేరి మోగింది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది.
AP Local Elections: ఏపీలో మరోసారి ఎన్నికల భేరి మోగింది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది.
రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలు, వార్డులు, డివిజన్లు, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. కీలకమైన నామినేషన్ల(Nominations)పర్వం ఇవాళ్టి నుంచి మొదలైంది. నగర పంచాయితీ పరిధిలోని 54 డివిజన్లు, 353 వార్డులుతో పాటు 7 కార్పొరేషన్లు, 13 మున్సిపాల్టీల పరిధిలోని కార్పొరేటర్, కౌన్సిలర్ ఖాళీలకు ఎన్నికలు ఇటీవల ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ పర్వం ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఇవాళ ఉదయం నుంచి 5వ తేదీ శుక్రవారం మద్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 6వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది 8వ తేదీ మద్యాహ్నం 3 గంటల్లోగా నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది.
ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయితీల్లో 9 లక్షల 58 వేల 141 మంది ఓటర్లున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల, ప్రకాశం జిల్లా దర్శి, చిత్తూరు జిల్లా కుప్పం, కర్నూలు జిల్లా బేతంచర్ల, కడప జిల్లా కమలాపురం, రాజంపేట అనంతపురం జిల్లా పెనుకొండ మున్సిపాలిటీ, నగర పంచాయితీలకు తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు ఎన్నికలు నిలిచిపోయిన 14 జడ్పీటీసీ, 176 ఎంపీటీసీ, 69 సర్పంచ్, 533 వార్డు సభ్యుల స్థానాలకు ఇప్పటికే నామినేషన్లు ప్రారంభమయ్యాయి. మరణించిన అభ్యర్ధి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి మాత్రం ఆయా స్థానాల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం(State Election Commission) అనుమతిచ్చింది.
Also read: AP Heavy Rains Alert: ఏపీలో మూడ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి