AP Heavy Rains Alert: ఏపీలో మూడ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

AP Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 3, 2021, 08:26 AM IST
  • బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
  • ఏపీలో రానున్న 3 రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక
  • అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వాతావరణ శాఖ
AP Heavy Rains Alert: ఏపీలో మూడ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

AP Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

ఏపీలో రానున్న 3 రోజులపాటు భారీ వర్షాలు(Heavy Rains)పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. తమిళనాడు, శ్రీలంక పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ అరేబియా సముద్రం వైపు ప్రయాణిస్తోంది. ఇది క్రమంగా ఉత్తర దిశగా ప్రయాణిస్తూ రాగల 36 గంటల్లో మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. మరోవైపు కొమరిన్, శ్రీలంక పరిసర ప్రాంతాల మీదుగా మధ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తాంధ్ర తీరం వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడింది. 

అల్పపీడనం(Low Pressure) ప్రభావంతో రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు లేదా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. 4, 5 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం(IMD)వెల్లడించింది. వేటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే నవంబర్ 6వ తేదీన ఇప్పటికే తుపాను హెచ్చరిక పొంచి ఉంది.

Also read: Chandrababu Naidu: ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనున్న తెలుగుదేశం పార్టీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News