Ongole Fire Accident: ప్రకాశం జిల్లాలోని ఒంగోలు టౌన్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ఉడ్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం జరగడం వల్ల ఆ మంటలు పక్కనే ఉన్న కావేరి ట్రావెల్స్ పార్కింగ్ లోకి వ్యాపించాయి. దీంతో అక్కడే నిలిచి ఉన్న బస్సుల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపుగా 8 బస్సులు దగ్ధమైనట్లు సమాచారం. వీటితో పాటు మరో రెండు బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. మంటల్లో దగ్ధమైన బస్సులు అన్నీ కావేరి ట్రావెల్స్ కు సంబంధించినవని తెలిసింది. మంటల కారణంగా ఏర్పడిన పొగ వల్ల చుట్టుపక్కల నివసించే వారు భయాందోళనలకు లోనయ్యారు. 


ఆ పార్కింగ్ ఏరియాలో దాదాపుగా 20 ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. సంఘటనా స్థలం నుంచి మిగిలిన బస్సులను తప్పించేందుకు కావేరి యాజమాన్యం చర్యలు చేపట్టింది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణమేంటో తెలియాల్సి ఉంది.  


Also Read: Weather Alert: ఆ ప్రాంతాల్లో భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!


Also Read: Ap Students in Ukraine: అక్కడి విద్యార్ధుల తరలింపు ఖర్చు ఏపీ ప్రభుత్వానిదే, సీఎం జగన్ ఆదేశాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook