Palla Srinivas Rao: కేబినెట్‌లోకి పల్లా శ్రీనివాస్ రావు!
Palla Srinivas Rao: ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్‌కు సీఎం చంద్రబాబు ప్రమోషన్ ఇవ్వబోతున్నారా..! పల్లా శ్రీనివాస్ యాదవ్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నారా..! మెగా బ్రదర్ నాగబాబుతో కలిపి పల్లాను కూడా ప్రమాణం చేయించబోతున్నారా..! పల్లా శ్రీనివాస్ కేబినెట్‌లోకి వస్తే.. మరి భర్తరఫ్ అయ్యే మంత్రి ఎవరు..!
Palla Srinivas Rao: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ ఏర్పడి దాదాపు ఆర్నెళ్లు దాటింది.. చంద్రబాబు ప్రభుత్వంలో మూడు పార్టీల నేతలకు మంత్రి పదవులు దక్కాయి. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన నేతలందరికీ పోస్టులు దక్కాయి. తాజాగా ఏపీ కేబినెట్‌లోకి జనసేన పార్టీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నాగబాబుతో పాటు.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావును కూడా మంత్రి వర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో పనిచేయని కొందరు మంత్రులపైన వేటు పడే చాన్స్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది..
ప్రస్తుతం ఏపీ కేబినెట్‌లో సీఎం చంద్రబాబుతో కలిపి మొత్తం 24 మంది మంత్రులు ఉన్నారు. మరో ఒక్కరికి సీఎం చంద్రబాబు అవకాశం కల్పించే చాన్స్ ఉంది. ఆ ఒక్క మంత్రి పదవి కోసం చాలా మంది లీడర్లు పోటీ పడ్డారు. ఇన్నాళ్లు ఈ పదవి రేసులో మూడు పార్టీల నేతలు ఉన్నారు. కానీ ఊహించిన రీతిలో మెగా ప్రదర్‌కు మంత్రి పదవి దక్కింది. ఈ వారంలోనే మెగా బ్రదర్ నాగబాబు ప్రమాణం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. పల్లాకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా యాదవ సామాజికవర్గానికి న్యాయం చేసినట్టు అవుతుందని సీఎం చంద్రబాబు లెక్కలు వేసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక పల్లా శ్రీనివాస్ రావు 2014లో తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. గాజువాక నుంచి పోటీ చేసిన పల్లా వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ముఖ్యంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఆర్నెళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి మరోసారి భారీ విజయం సాధించారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పల్లా శ్రీనివాస్ రావే అత్యధిక మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. అనకాపల్లి నుంచి షిఫ్ట్ అయ్యి గాజువాకలో పోటీకి దిగిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను చిత్తుచిత్తుగా ఓడించారు. దాంతో పల్లాకు ఊహించని రీతిలో ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు సీఎం చంద్రబాబు.. అప్పట్లోనే పల్లాను తన కేబినెట్‌లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు భావించినా.. వీలు కాలేదు.. దాంతో ఇప్పుడు పల్లాకు లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగబాబుతో కలిపితే.. ఏపీ కేబినెట్ కూర్పు పూర్తవుతుంది. మరి పల్లాకు ఎక్కడ చాన్స్ ఉందని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారట. కానీ ఇప్పుడున్న మంత్రుల్లో ఒకరిని భర్తరఫ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది..
మొత్తంగా సీఎం చంద్రబాబు ఇప్పుడు ఏ మంత్రికి షాక్ ఇవ్వబోతున్నారు అనేది హాట్ టాపిక్‌గా మారింది. సొంత పార్టీకి చెందిన మంత్రిని కేబినెట్ నుంచి బయటకు పంపిస్తారా..! లేదంటే జనసేన మంత్రిని బయటకు పంపుతారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీ కేబినెట్‌లో బీజేపీకి కేవలం ఒక్క మంత్రి పదవి మాత్రమే దక్కింది. సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ వైద్యారోగ్యశాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. కాబట్టి ఆయన్ను పక్కన పెట్టకపోవచ్చు అనే టాక్ వినిపిస్తోంది. అలాగే జనసేనకు నలుగురు మంత్రులు ఉండగా.. నాగబాబుతో కలిపితే.. ఈ సంఖ్య ఐదుకు చేరుతుంది. దాంతో వీరిని కూడా బయటకు పంపకపోవచ్చు అనే చర్చ జరుగుతోంది. అటు రెండు పార్టీలకు చెందిన మంత్రులను తప్పించని పక్షంలో సొంత పార్టీ లీడర్‌పైనే వేటు పడే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. అయితే వేటు పడే ఆ మంత్రి ఎవరనేది మాత్రం సొంత పార్టీ లీడర్లకు సైతం అంతుచిక్కడం లేదట. అయితే కేబినెట్‌లో సరిగ్గా పనిచేయని మంత్రిపై మాత్రం వేటు పడటం పక్కా అని సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుకుంటున్నారు..
Also Read: Manchu Family: మంచు కుటుంబంలో మరో బిగ్ ట్విస్ట్.. విష్ణు చంపేస్తాడని మనోజ్ ఫిర్యాదు
Also Read: Sritej Family: రేవంత్ రెడ్డి దెబ్బకు దిగివచ్చిన పుష్ప 2 నిర్మాతలు.. రేవతి కుటుంబానికి రూ.50 లక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.