Panchayat second phase: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో రెండు దశలు ముగిసిపోయాయి. ఇంకా రెండు విడతల ఎన్నికలున్నాయి. రెండు దశల్లోనూ అధికార పార్టీ హవా కన్పించగా..టీడీపీ సీనియర్ నేతల సొంత ఇలాకాలో పార్టీకు ఘోరమైన దెబ్బ తగిలింది. పార్టీ కంచుకోటగా భావించే జిల్లాలో సింగిల్ డిజిట్‌కు పరిమితం కావల్సిన పరిస్థితి ఏర్పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొన్నటి వరకూ అనంతపురం ( Ananthapuram ) జిల్లా తెలుగుదేశం పార్టీ ( Telugu desam party )కు కంచుకోట. 2019 ఎన్నికలు తప్ప..మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు తెలుగుదేశం పార్టీనే దక్కించుకుంటుంది. అలాంటిది ఇప్పుడు పరిస్థితి మారుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికలే దీనికి నిదర్శనం. ఇప్పుడు పంచాయితీ ఎన్నిక ( Panchayat Elections )ల్లో సైతం అదే పరిస్థితి. ఏపీలో జరిగిన రెండవ దశ పంచాయితీ ఎన్నిక ( Second phase panchyat elections )ల్లో జిల్లాలోని సీనియర్ నేతల ఇలాకాలో పార్టీకి ఘోరమైన ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రులు, పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, సీనియర్ నేత ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సొంత ప్రాంతంలో పార్టీకు కోలుకోలేని దెబ్బ తగిలింది. పరిటాల సునీత ( Parital sunitha ) సొంత మండలం రామగిరిలో  26 ఏళ్ల పరిటాల కుటుంబం ఆధిపత్యానికి చెక్ పడింది. మండలంలోని 7 స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ముఖ్యంగా రామగిరి, పేరూరు, కుంటిమద్ది, పోలేపల్లి, కొండాపురం, గంతిమర్రి, చెర్లోపల్లి  పంచాయితీల్ని వైసీపీ ( Ycp ) మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ధర్మవరం నియోజకవర్గంలోని 70 పంచాయితీల్లో 63 స్థానాల్ని వైసీపీ బలపర్చిన అభ్యర్ధులు సొంతం చేసుకున్నారు. 


ఇక మరో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ( Kalva srinivasulu ) ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గంలో అదే పరిస్థితి. రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని 87 పంచాయితీల్లో 70 స్థానాల్ని వైసీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. అటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహించిన ఉరవకొండ నియోజకవర్గంలో కూడా పార్టీ పట్టు కోల్పోయింది. బెళుగుప్ప మండలంలోని 19 పంచాయితీల్లో 15 స్థానాల్ని వైసీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. 


Also read: Second phase panchayat results: ఏపీ రెండోదశ పంచాయితీల్లో కూడా వైసీపీదే హవా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook