Pawan Kalyan: సముద్రంలో పవన్ కల్యాణ్ `సీజ్ షిప్` వెనుక పెద్ద ప్లానే? నిజం తెలిసి టీడీపీ దిగ్భ్రాంతి
Pawan Kalyan Big Plan In Kakinada Port PDS Rice Smuggling: ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టులో చేసిన హంగామాపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. అయితే అక్కడ టీడీపీ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక పెద్ద ప్లానే ఉందని సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
Vanamudi Kondababu: రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశం ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అంతకుమించి జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్థానిక తెలుగుదేశం పార్టీ కాకినాడ ఎమ్మెల్యేను దూషించడం.. దుర్భాషలాడడం సంచలనం రేపింది. కొన్నాళ్లుగా తరచూ టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులపై పవన్ కల్యాణ్ విరుచుకుపడడంతో రాజకీయంగా కలకలం రేపుతోంది. కూటమిలో భాగమైన టీడీపీని లక్ష్యంగా చేసుకుని జనసేన అధినేత విమర్శిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక కాకినాడ పోర్టులో పవన్ కల్యాణ్ చేసిన హైడ్రామా వెనుక మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పెద్ద ప్లానింగ్‌తోనే డిప్యూటీ సీఎం అలా చేశారనే అంశం బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి మింగుడుపడని విషయంగా మారింది.
Also Read: Zee Telugu: ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అనుచరుల అరాచకం.. జీ తెలుగు న్యూస్ రిపోర్టర్‌పై దాడి
బియ్యం అక్రమ రవాణా అంశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు డిప్యూటీ సీఎం క్లాస్ తీసుకున్న విషయం తెలిసిందే. పోలీస్ అధికారులైన ఎస్పీ, డీఎస్పీలపై మండిపడ్డారు. 'ఎస్పీ ఎక్కడికి పోయాడు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'డీఎస్పీని పిలిచి ఇంత నిర్లక్ష్యం పనికిరాదు' అని నిలదీశారు. ఇలా ఒకేసారి ముగ్గురిపై డిప్యూటీ సీఎం విరుచుకుపడడం వెనుక వేరే కారణం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు లక్ష్యంగా పవన్ వ్యవహారం నడిపించినట్లు పుకార్లు వస్తున్నాయి. పవన్‌కు అంతగా కోపం రావడం వెనుక కొండబాబు ఏం చేశారు? అసలు ఏం జరిగిందనేది కాకినాడ జిల్లాలో ప్రధాన చర్చ జరుగుతోంది.
Also Read: Sachivalaya System: మళ్లీ సచివాలయ వ్యవస్థలో భారీ మార్పులు.. సీఎం చంద్రబాబు ఫోకస్
ఇక్కడ మొదలు
కాకినాడ నగరంలో దీపావళి సందర్భంగా ఓ వివాదం రాజుకుంది. మూడు రోజులపాటు బాణసంచా రిటైల్ వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే జనావాసాల మధ్య తమకు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే కొండబాబు అనుచరులు పట్టుబట్టారు. జనసేనకు చెందిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ దానికి అంగీకరించకుండా వాటిని రద్దు చేయించారు. దీంతో ఎంపీపై ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జనసేన ఎంపీని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులు బీభత్సం సృష్టించడం పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లింది. టీడీపీ నాయకులు ఆందోళన చేసినా డీఎస్పీ, ఎస్పీ పట్టించుకోకపోవడంతో ఈ అంశం కూడా పవన్ మదిలో ఉంది.
పెద్ద ప్లానే?
ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడలో పర్యటించిన సమయంలో బియ్యం అక్రమ రవాణాను వాడుకున్నారు. దాన్ని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యే కొండబాబుపై విరుచుకుపడ్డారు. ఆ అంశాన్ని పట్టుకుని పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్లాన్ ప్రకారం పవన్ వ్యవహారించారని కొండబాబు వర్గంతోపాటు టీడీపీ నాయకుల్లో చర్చ జరుగుతోంది. కూటమి మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లినట్లు సమాచారం. భవిష్యత్ దృష్ట్యా ప్రస్తుతానికి సర్దుకుపోవాలని కొండబాబుకు సీఎం సూచించినట్లు తెలుస్తోంది. అయితే పవన్ ఇలా పద్ధతి ప్రకారం దెబ్బ కొట్టడం వెనుక 'పెద్ద ప్లానే' అంటూ కాకినాడ ప్రజలు చర్చించుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.