'కరోనా వైరస్'పై పోరాటం అనేది సామాజిక బాధ్యత. ఈ యుద్ధానికి అందరూ సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. 'కరోనా వైరస్'ను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO ప్రకటించింది. ఈ క్రమంలో దీన్ని ఎదుర్కునేందుకు పెద్ద ఎత్తున నిధులు కూడా అవసరమవుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వాలు ఈ  నిధులను పూర్తిగా సమకూర్చుకోవడం కూడా కష్టమే. కాబట్టి మనసు మారాజులు, కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం  ఏర్పడింది. ఇప్పటికే తెలగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో నితిన్ తన వంతు బాధ్యతగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు చెరో 10 లక్షల రూపాయల  చొప్పున విరాళం ప్రకటించారు. అందులో తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం 10 లక్షల రూపాయల చెక్కును సీఎం కేసీఆర్ కు అందించారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ .. 2 కోట్ల రూపాయల చెక్కును తన తండ్రి ద్వారా సీఎం కేసీఆర్ కు అందజేశారు. 


'కరోనా వైరస్' సమాచారం కోసం వాట్సప్ నంబర్


మరోవైపు ఈ కోవలోకి జనసేనాని చేరారు. జనసేన అధినేత పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ 'కరోనా వైరస్'పై పోరాటానికి నేనున్నాంటూ ముందుకొచ్చారు. ప్రధాన మంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీని కలిసి కోటి  రూపాయల చెక్కును ఆయనకు అందజేయనున్నారు.



అంతే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల  సహాయ నిధికి తన వంతు సాయంగా చెరో 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. త్వరలోనే ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేయనున్నారు.



జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..