Tirumala Laddu Issue: తిరుపతి లడ్డూపై జరుగుతున్న వివాదంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టిన అనంతరం ఆదివారం డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మీడియా సమావేశంలో హిందూవులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిస్తే హిందూవులుగా మాట్లడరా? ఎవరూ స్పందించరా? అంటూ నిలదీశారు. హిందూ ధర్మంపై దాడి జరిగితే  తాను యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Pawan Kalyan: తిరుమల లడ్డుపై పవన్ సంచలన నిర్ణయం..11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష


 


'వేరే మతానికి జరిగితే వారు ఇప్పటికీ చాలా హడావుడి చేసేవారు. హిందూవులకు మనోభావాలు ఉండవా' అని జనసేన అధినేత ప్రశ్నించారు. 'మిగతా ప్రభుత్వలాలుగా నిశ్శబ్దంగా ఉండే ప్రభుత్వం కాదు. మాకు కూడా మనసు ఉంది.. నేను మాట్లాడతాను. హిందూ ధర్మం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం' అని పేర్కొన్నారు. 'టీటీడీ పాలకవర్గం నిబద్ధతతో పనిచేయాలి' అని సూచించారు. 'తిరుమలలో ఉద్యోగులు ఎన్ని రోజులు ఎందుకు మెదలకుండా ఉన్నారు. మీరు హిందువులు కాదా' అని నిలదీశారు.

Also Read: Tirumala Laddu: తిరుమల లడ్డూపై మరింత గందరగోళానికి తెరలేపిన టీటీడీ సంచలన ప్రకటన


 


టీటీడీ ఉద్యోగులపై శాపనార్థాలు
'సాటి హిందువులను కూడా ప్రశ్నిస్తున్న. ప్రతి హిందూ ముందుగా వారి మతాన్ని గౌరవించుకోవాలి. తప్పు జరిగిన క్షణంలో హిందువులు మాట్లాడాలి.. మెతకతనం వీడాలి' అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సూచించారు. 'తిరుమల ఉద్యోగులు లడ్డు ప్రసాదాలలో పంది కొవ్వు కలిస్తే మాట్లాడకుండా ఉన్న మీకు మహా పాపం తగిలుతుంది' అని శాపనార్థాలు పెట్టారు. 'స్వామివారి పూజా విధానం గత ప్రభుత్వం మార్చేసింది. శ్రీవాణి దర్శన టికెట్లు తెచ్చి బక్తులను దోచుకున్నారు. రాముల వారి విగ్రహం తలనరికినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు' అంటూ జగన్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.


శ్వేతపత్రం
టీటీడీపై శ్వేత పత్రం విడుదల చేయాలని పవన్‌ కల్యాణ్ డిమాండ్‌ చేశారు. 'కల్తీలు దారుణంగా  జరిగాయి. పశువులకు సంబంధించిన కొవ్వు ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. 219 గుడులు అపవిత్రం చేసినప్పుడు నేను హిందువుగా రోడ్లపై వస్తే పరిస్థితి వేరుగా ఉండేది. రాజకీయ ప్రయోజనాలు కోసం మేం ప్రయత్నించలేదు. తప్పు జరిగినప్పుడు ప్రశ్నించకుండా ఉండటడం కూడా తప్పే' అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.


అసెంబ్లీ, మంత్రివర్గంలో చర్చ
'మసీదు, చర్చిమీద జరిగితే దేశం అల్లకల్లోలం అయ్యేది. హిందూ మతానికి అపచారం జరిగితే మేము మాట్లాడకూడదా?' అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. దోషులకు శిక్ష పడాలని డిమాండ్‌ చేశారు. 'దర్శనానికి టికెట్లు, కాంట్రాక్టుల కోసమేనా టీటీడీ బోర్డు ఉందా' అని నిలదీశారు. 'మంత్రివర్గం, అసెంబ్లీలో తిరుమలపై చర్చించాలని సీఎం చంద్రబాబును కోరుతున్నా. ఈ చర్చలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కూడా పాల్గొనాలి. టీటీడీలో పనిచేస్తే ఉద్యోగులు మీరు ఎందుకు మాట్లాడరు. మీకు ఆశ్రయం ఇచ్చిన తిరుమల వెంకన్నకు అపచారం జరిగితే మాట్లాడటానిక కారణం ఏమిటి' అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.