Pawan Kalyan Meets Chandrababu: వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చబోమని స్పష్టం చేసిన జనసేన అధినేత పనవ్ కళ్యాణ్.. టీడీపీతో పొత్తు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయమని ప్రచారం ఊపందుకుంది. ఇద్దరు కలిసి ఏం చర్చించారనేది సస్పెన్స్‌గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లగా.. చంద్రబాబు ఎదురు వచ్చి మరీ స్వాగతం పలికారు. ఇటీవల కుప్పం ఘటనపై చంద్రబాబుకు పవన్ సంఘీభావం తెలిపారు. గతంలో విశాఖ ఘటనపై పవన్‌ను  చంద్రబాబు పరామర్శించిన సంగతి తెలిసిందే. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, కుప్పం ఘటనపై ఇద్దరు చర్చించుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీవో1పై కూడా చర్చించినట్లు సమాచారం. 


ఇక పవన్-చంద్రబాబు భేటీపై వైసీపీ నేతలు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. సంక్రాంతి పండుగ మామూళ్ల కోసం దత్తతండ్రి చంద్రబాబు నాయుడు వద్దకు దత్త పుత్రుడు వెళ్లాడంటూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ట్వీట్ చేశారు. 'చంద్రబాబుకు ఎలా అవసరం అయితే అలా సహకారించడానికి  సిద్దంగా ఉన్నావన్నది బహిరంగా రహస్యమే. ఇంకా ఎందుకు ఈ ముసుగులో ముద్దులాట..? ముసుగు తీసేయండయ్యా.. జనాలు కూడా మీరిద్దరికి కలిపి గట్టిగా బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారు..' అంటూ ఆయన రాసుకొచ్చారు.




సంక్రాంతికి అందరింటికి గంగిరెద్దులు వెళ్తాయని.. చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లాడంటూ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. డూడూ బసవన్నలా తల ఊపడానికి వ్యంగ్యంగా కామెంట్ చేశారు.


'చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు సంఘీభావం తెలుపడం శుభపరిణామం. ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ఫాసిస్ట్ జీవోలపై సమష్టి పోరాటం అత్యవసరం. రాబోయే విజయ దశమిలోగా ప్రజలు సరైన తీర్పు ఇస్తారు. దుష్ట శిక్షణ తథ్యం. మంచి రోజులు వస్తున్నాయి!' అని ఎంపీ రఘు రామకృష్ణంరాజు ట్వీట్ చేశారు.



 


Also Read: Director Surender Reddy: షూటింగ్‌లో గాయపడిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. నొప్పిని సైతం లెక్కచేయకుండా..  


Also Read: India vs Sri Lanka: రాజ్‌కోట్‌లో సూర్య సునామీ.. బౌలర్ల మెరుపులు.. శ్రీలంక చిత్తు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి