Pawan Kalyan News: కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా 'కౌలు రైతుల భరోసా యాత్ర'ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కలిసి పరామర్శించి.. వారికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ యాత్రను శ్రీ సత్య సాయి జిల్లాలోని కొత్త చెరువు నుంచి పవన్ ప్రారంభించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు సాకే రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కల్యాణ్.. రామకృష్ణ భార్య సుజాతకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన పార్టీ తరఫున తమకు అండగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు. 


ఆ తర్వాత ధర్మవరం మండలానికి చెందిన గొట్లూరు గ్రామానికి జనసేనాని పవన్ కల్యాణ్ చేరుకోనున్నారు. పూలకుంట, మన్నీల గ్రామాలకు చేరుకొని.. అక్కడ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించిన ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు. అయితే ఈరోజు సాయంత్రం మన్నీల గ్రామంలో పవన్ రచ్చబండ నిర్వహించనున్నారు. 



ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవలే రూ. 5 కోట్లను పార్టీకి విరాళంగా ఇచ్చారు. ఇంటిపెద్దను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న వారికి కొంత సాయం చేయాలనే దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కౌలు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించి ఆర్థిక సాయం అందిస్తున్నారు.  


Also Read: AP New Ministers: కాళ్లకు నమస్కరిస్తూ, చేతిని ముద్దాడుతూ.. సీఎం జగన్ పై కొత్త మంత్రుల విధేయత!


Also Read: Shock for CBI officers: CBI అధికారులకు షాక్‌ ఇచ్చిన AP అధికారులు.. గదులు ఖాళీ చేయాలని ఆదేశం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook