Pawan kalyan son akiranandan auto journey in Varanasi: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంత ఉన్నతంగా ఎదిగిన కూడా ఒదిగే ఉంటారని తెలుస్తొంది. ఎల్లప్పుడు కూడా.. ప్రజలతో ఎంతో ప్రేమతో మాట్లాడుతుంటారు. ఆయన పవన్ స్టార్ గా ఉన్నప్పుడు ఎలా ఉండేవారో.. డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత కూడా అదేవిధంగా ప్రజల్ని, తన అభిమానుల్ని కూడా ఎంతో ప్రేమతో వారికి మంచి చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఈక్రమంలో పవన్ కళ్యాన్ తనకు ఏ మాత్రం కాస్తంత తీరిక దొరికిన ఆద్య, అకీరా నందన్ లతో టైమ్ స్పెండ్ చేస్తుంటారు. ముఖ్యంగా ఆద్య ఎక్కువగా తన తండ్రితో ఇటీవల అనేక చోట్ల కన్పిస్తు.. సందడి చేశారు. ఇదిలా ఉండగా.. ఆద్య, అకిరా నందన్ లు ఇటీవల తన తల్లితో వారణాసికి వెళ్లినట్లు తెలుస్తొంది.అక్కడ సామాన్యుల  మాదిరిగా  ఆటోలో ప్రయాణిస్తు అందర్ని ఆశ్చర్యానికి గురిచేశారు.


అయితే.. కొంత మంది మాత్రం.. ఆద్య, అకిరా నందన్ లను గుర్తు పట్టినట్లు తెలుస్తొంది.  అయితే.. ఒకస్టేట్ కు డిప్యూటీ సీఎంకు బిడ్డలైన కూడా.. ఎంతో సింపుల్గా సామాన్య ప్రజల్లా వారు ఆటోలో ప్రయాణించడం పట్ల అక్కడున్న వారంత ఆశ్చర్యపోతున్నారంట. ఈ వీడియోలను.. రేణు దేశాయ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తొంది. దీంతో ఇది కాస్త ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.


Read more: Pawan kalyan: రేవంత్ రెడ్డి నిజమైన హీరో.. అల్లు అర్జున్ ఘటనపై షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్.. ఏమన్నారంటే..?


ఈ వీడియోలను చూసిన వారంత తండ్రికి తగ్గ బిడ్డలంటూ కూడా ఆద్య, అకిరా నందన్ లపై ప్రశంసలు కురిపిస్తున్నారంట. మరోవైపు..ఆద్య, అకిరాలను ఆడంబరాలు, విలాసాలకు అతీతంగా తల్లి రేణు దేశాయ్ సాధారణంగా పెంచడంపై నెటిజన్ లు ప్రశంసలు కురిపిస్తున్నారు.