Pegasus Spyware: దేశవ్యాప్తంగా దుమారం రేపిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతోంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంకు సమస్యగా మారింది. ఈ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం హౌస్ కమిటీ ఏర్పాటు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు తెలుగుదేశం పార్టీని ఇరుకునపెడుతున్నాయి. పాతివ్రత్యం నిరూపించుకోవల్సిన బాధ్యత ఇప్పుడు టీడీపీపై పడింది. చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందనేది మమతా బెనర్జీ ఆరోపణ. ఈ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో చర్చ సాగింది. తెలుగుదేశంపై అధికార పార్టీ విమర్శలు గుప్పించింది. 


ఈ వ్యవహారంపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీలో చర్చించాలని వైసీపీ సభ్యులు కోరగా..ముందుగా నోటీసు ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారామ్ సూచించారు. ప్రభుత్వ ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి నోటీసు ఇవ్వడంతో చర్చకు స్పీకర్ అనుమతిచ్చారు. పెగాసస్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఫోన్లు ట్యాపింగ్ చేసే అవకాశముందని..అందుకే సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టిందని రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగుదేశం మాత్రం పెగాసస్ స్పైవేర్ కొనుగోలుకు ప్రతిపాదన వచ్చినా..తిరస్కరించామంటోంది. అధికార పార్టీ కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా బురద జల్లేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ నేత నారా లోకేష్ ఆరోపించారు. 


ఈ వ్యవహారంపై చర్చ అనంతరం దర్యాప్తు కోసం హౌస్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అంటే నాడు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇజ్రాయిల్ దేశపు ఎన్ఎస్ఓ గ్రూపుకు చెందిన వివాదాస్పద పెగాసస్ స్పైవేర్ కొనుగోలు జరిగిందా లేదా..జరిగితే ఎలా ఎప్పుడు వినియోగించారనేది దర్యాప్తు చేయనున్నారు. మరో రెండ్రోజుల్లో హౌస్ కమిటీ సభ్యుల్ని ప్రకటిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. 


Also read: Kadapa Murder: మటన్ ముక్కల కోసం మర్డర్.. కడపలో కలకలం రేపిన హత్య...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook