సినీ నటుడు కృష్ణుడు వైఎస్సార్‌సీపీలో చేరారు. సోమవారం పాదయాత్రలో భాగంగా కత్తిపూడిలో వైఎస్‌ జగన్‌ సమక్షంలో నటుడు కృష్ణుడు వైసీపీలో చేరారు. జగన్.. కృష్ణుడికి పార్టీ కుండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో చేరిన అనంతరం కృష్ణుడు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ పాదయాత్రతో స్ఫూర్తి పొంది తాను పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపుకు తన వంతు కృషి చేస్తానని కృష్ణుడు పేర్కొన్నారు. గతంలో కృష్ణుడు హ్యాపీ డేస్, పోకిరి, ఏం మాయచేసావే, విలేజ్లో వినాయకుడు, గోపాల గోపాల తదితర చిత్రాల్లో నటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొద్ది రోజుల క్రితమే నటుడు పోసాని కృష్ణ మురళి, కమెడియన్ పృథ్వీ, సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు తదితరులు ప్రజా సంకల్పయాత్రలో జగన్‌ను కలిసి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.


మరోవైపు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఈ రోజుతో 230వ రోజుకు చేరుకుంది. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి శివారు నుంచి యాత్ర ప్రారంభమై.. అక్కడి నుంచి నెల్లిపూడి, శ్రీశాంతి ఆశ్రమం క్రాస్‌ మీదుగా శంఖవరం వరకు కొనసాగుతుంది. రాత్రికి జగన్ శంఖవరంలో బస చేస్తారు. దారి పొడవునా ప్రజలు తమ సమస్యల్ని జగన్‌కు చెప్పుకుంటున్నారు.