King Cobra lying on Mid Road during Lunar Eclipse 2022 in AP: నాగుల చవితి, పున్నమి రోజులలో నాగుపాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. గుళ్లలో లేదా పుట్టలలో నాగుపాములు భక్తులకు కనిపిస్తుంటాయి. దాంతో నాగుపాములకు పాలు పోసి భక్తి శ్రద్దలతో పూజిస్తారు. మంగళవారం (నవంబర్ 8) కార్తీక పౌర్ణమి.. అందులోనూ చంద్ర గ్రహణం వచ్చింది. దాంతో నాగుపాములు జనావాసాల్లోకి వచ్చాయి. పున్నమి వేళ నడిరోడ్డుపై ఓ నాగుపాము పడగవిప్పింది. అంతేకాదు గ్రహణం స్టార్ట్ అయినప్పటి నుంచి ముగేసేవరకు రోడ్డుపైనే ఉంది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే... చంద్రగ్రహణం సమయంలో ప్రకాశం జిల్లా దోర్నాల-మార్కాపురం మెయిన్ రోడ్డుపై ఓ నాగుపాము హల్చల్ చేసింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. పెద్దారవీడు మండలం బద్విడు చెర్లోపల్లి వద్ద నడిరోడ్డుపై పడగవిప్పింది. పామును చూసిన వాహనదారులకు వాహనాలను ఆపేశారు. వాహనాలు ముందుకు కదిలితే.. వెంబడిస్తుండడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గ్రహణం స్టార్ట్ అయినప్పటి నుంచి ముగేసేవరకు (సాయంత్రం 6 గంటల నుంచి 6.30 గంటల వరకు) రోడ్డుపైనే ఉంది. 


నడిరోడ్డుపై నాగుపాము పడగవిప్పి అరగంట పాటు బుసకొట్టింది. మనుషులు, వాహనాల అలికిడి విన్నా.. అదరలేదు, బెదరలేదు. నడిరోడ్డుపై అలానే ఉండిపోయింది. బయపడిపోయిన వాహనదారులు అక్కడే ఉండిపోయారు. దీంతో ఆ రహదారిలో సుమారు అరగంట పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే అనూహ్యంగా చంద్రగ్రహణం వీడిన తర్వాత ఆ నాగుపాము రోడ్డుపై నుంచి వెళ్ళిపోయింది. దాంతో వాహనదారులను విస్మయానికి గురయ్యారు. నాగుపాము వెళ్లిపోవడంతో ట్రాఫిక్ క్లియర్ అయ్యింది.



నడిరోడ్డుపై నాగుపాము పడగవిప్పిన ఘటనకు సంబందించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగుపాము నడిరోడ్డుపై ఉన్నపుడు వాహనదారులు వీడియోలు తీసి తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసారు. చంద్రగ్రహణం వేళ నడిరోడ్డుపై పగడవిప్పి నాగుపాము బుసలు కొట్టడం ప్రస్తుతం నెట్టింట చర్చకు దారితీసింది. ఈ ఘటనపై అందరూ తమ అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.


Also Read: IND vs ENG: 'విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేనప్పుడు రన్స్ చేయాలని కోరుకున్నా.. కానీ గురువారం మాత్రం డకౌట్ కావాలి'  


Also Read: Sania-Shoaib Divorce: సానియా, షోయబ్‌ల విడాకులు.. వెలుగులోకి అసలు కారణం! వివాహేతర సంబంధమే  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి