Balineni Srinivasa Reddy: ప్రకాశం జిల్లా వైసీపీలో గందరగోళం నెలకొంది. టికెట్స్ ఎవరికి వస్తాయో అర్ధం కాని పరిస్థితి ఉంది. ఒంగోలు ఎంపీ సీటును మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇవ్వకపోవడంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఒంగోలులోని విష్ణుప్రియా కళ్యాణ మండలంలో నిర్వహించిన సంతనూతలపాడు నియోజవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన హాజరుకాలేదు. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఈ కూడా సమావేశాన్ని పట్టించుకోలేదు. తనను సంప్రదించకుండానే సంతనూతలపాడు అసెంబ్లీ ఇంఛార్జీని మార్చడంపై బాలినేని వర్గం నేతలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. హైదరాబాద్‌లో మహేష్ బాబు గుంటూరు కారం మూవీ థియేటర్‌లో బాలినేని ప్రత్యక్షమయ్యారు. ఆయనను బుజ్జిగించేందుకు శనివారం బాలినేనితో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి భేటీ కానున్నారు.
 
విజయవాడలో నాలుగు రోజులు ఉన్నా.. సీఎం జగన్ అపార్ట్‌మెంట్ దొరక్కపోవడంతో బాలినేని హైదరాబాద్‌ వెళ్లిపోయారు. వైసీపీ నేతల ఫోన్లు చేసినా ఆయన స్పందించట్లేదు. ఆయన వర్గం నేతలు కూడా సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. కొండెపి, ఒంగోలులో విజయసాయిరెడ్డి నిర్వహించిన సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు మానుగుంట మహీధర్ రెడ్డి, కరణం బలరాం, అన్నా రాంబాబు, కుందూరు నాగార్జున రెడ్డి హాజరుకాలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఎం జగన్‌తో పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ భేటీ అయ్యారు. ఒంగోలు నుంచి పోటీకి సిద్ధంగా ఉండాలని రవిశంకర్‌కు జగన్ సూచించినట్లు తెలుస్తోంది. బాలినేనికి టికెట్ అంటూనే మరికొందరితో వైసీపీ అధిష్టానం చర్చలు జరపడంపై ఆయన అనుచరులు మండిపడుతున్నారు. ఒంగోలు ఎంపీ టిక్కెట్ మాగుంట ఇవ్వాలని బాలినేని పట్టుపట్టినా.. సీఎం జగన్ స్పందించట్లేదు. మరోవైపు హైదరాబాద్‌లో బాలినేనితో భేటీ అయ్యారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తాను ఒంగోలు ఎంపీగా పోటీకి చేస్తానని ఆయన చెప్పారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. 


బాలినేని నిర్ణయంపై జిల్లాలో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన పార్టీని వీడతారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మాగుంటకు టికెట్ రాకపోతే.. టీడీపీలోకి వెళ్లనున్నారని ప్రచారం జరుగుతోంది. దర్శి, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం తాను సూచించిన వాళ్లకు టికెట్ ఇవ్వాలని బాలినేని పట్టుపడుతున్నారు.


దర్శి టికెట్‌ను బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ప్రకటించగా.. సీఎం జగన్‌తో దర్శి ఎమ్మెల్యే మద్దిసెట్టి వేణుగోపాల్ భేటీ అయ్యారు. చీరాల టికెట్ కోసం ఆమంచి కృష్ణమోహన్ ప్రయత్నిస్తున్నారు. యాక్సిడెంట్ ప్రమాదంలో గాయపడిన చీరాల ఇంఛార్జ్ కరణం వెంకటేష్ బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డికి టికెట్ హామీ దక్కలేదు. దీంతో జిల్లా రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. ఎవరికి టికెట్ దక్కుతుందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. 


Also Read: Saindhav Twitter Review: సైంధవ్ ట్విట్టర్ రివ్యూ.. ఇది పెద్దోడి విశ్వరూపం.. వెంకీ మామ హిట్ కొట్టేశాడా..?  


Also Read: January Bank Holidays List: బిగ్ అలర్ట్.. బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు..!   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook