అమరావతి రాజధాని భూముల కుంభకోణం ( Amaravati capital lands scam ) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఐడీ ఎఫ్‌ఐఆర్ ( CID FIR ) ‌ను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లన్నీ టీడీపీ నేత  లోకేష్ ( TDP Leader Nara lokesh ) సన్నిహితులు దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) రాజధాని ప్రాంతం అమరావతి భూముల కుంభకోణం వ్యవహారంలో మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ ( Ex Advocate General Srinivas ) పై సీఐడీ విచారణ ( CID Probe ) ను నిలిపివేయాల్సిందిగా ఏపీ హైకోర్టు ( Ap High court ) ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద రాద్ధాంతమే జరిగింది. సుప్రీంకోర్టు ( Supreme court ) కూడా ఈ ఆదేశాల్ని తప్పబట్టింది. ఇప్పుడు ఇదే కేసులో సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని కోరుతూ మరికొన్ని పిటీషన్లు దాఖలయ్యాయి. టీడీపీ నేత నారా లోకేష్ సన్నిహితులుగా భావిస్తున్న కిలారు రాజేశ్, అతని భార్య శ్రీహాస, నార్త్ ఫేస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు వెంకటేశ్వరరావు, చేకూరు తేజస్వి తదితరులు ఈ పిటీషన్లను దాఖలు చేయడం గమనార్హం. 


రాష్ట్ర రాజధాని ఏ ప్రాంతంలో వస్తుందనేది అప్పటి ప్రభుత్వ పెద్దల ద్వారా ముందుగానే తెలుసుకుని..అమరావతి చుట్టుపక్కల భూములు కొనుగోలు చేసి లబ్దిపొందారని..దీనిపై విచారణ జరిపించాలని ఇదే ప్రాంతానికి చెందిన సురేష్ అనే వ్యక్తి సీఐడీ ( CID ) కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ప్రాధమిక దర్యాప్తు చేసిన సీఐడీ..కొంతమందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదైనవారే ఇప్పుడు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతున్నారు. 


ప్రస్తుతం దసరా సెలవుల నేపధ్యంలో అత్యవసర కేసుల్ని విచారించే వెకేషన్ కోర్డు న్యాయమూర్తిగా జస్టిస్ రజనీ ఉన్నారు. అత్యవసర కేసులంటే సహజంగా అంటే హైకోర్టు విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం..బెయిల్స్, ముందస్తు బెయిల్స్ మాత్రమే విచారించాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా  సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను  కొట్టివేయాలంటూ దాఖలైన క్వాష్ పిటీషన్లను ( Quash petitions ) హైకోర్టు విచారించనుండటం విశేషం.


నవంబర్ 5 న జస్టిస్ రజని పదవీ విరమణ చేయనున్న నేపధ్యంలో ఈ క్వాష్ పిటీషన్లు విచారణకొచ్చాయి. ఇప్పటికే మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై సీఐడీ విచారణ నిలిపివేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదమైన తరుణంలో..ఈ పిటీషన్ల వ్యవహారం ఏమవుతుందనేది ఆసక్తిగా మారింది. దమ్మాలపాటి కేసులో హైకోర్టు ఆదేశాల్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు..విచారణను ఎలా నిలిపివేస్తారంటూ ప్రశ్నించిన సందర్భముంది.  Also read: AP: రేపు జరిగే ఎస్ఈసీ సమావేశానికి అధికార పార్టీ దూరం