AP Three Capital Issue: త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ : ఎంపీ విజయసాయి రెడ్డి
AP Three Capital Issue: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశం మరోసారి తెరపైకొచ్చింది. విశాఖపట్నంకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌పై రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
AP Three Capital Issue: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశం మరోసారి తెరపైకొచ్చింది. విశాఖపట్నంకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌పై రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల్ని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. కోర్టు వివాదాల కారణంగా ఈ అంశం ఇప్పుడు పెండింగ్ లో ఉంది. కరోనా విపత్కర పరిస్థితుల నేపధ్యంలో కొద్దికాలంగా తెరపై లేని మూడు రాజధానుల అంశం ఇప్పుడు మళ్లీ కీలకంగా మారింది.
విశాఖపట్నంకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ (Visakhapatnam Executive Capital) త్వరలోనే వస్తుందని రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. విశాఖలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నుంచి పరిపాలన చేస్తామన్నారు. సీఆర్డీఏ కేసుకు రాజధాని తరలింపుకు సంబంధం లేదన్నారు విజయసాయి రెడ్డి(Vijayasai reddy). ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పాలించవచ్చని చెప్పారు. పంచ గ్రామాల సమస్యపై కోర్టుకు ఇప్పటికే అఫిడవిట్ సమర్పించామన్నారు. కోర్టు అనుమతి మేరకే ఇళ్ల యజమానులకు పట్టాలిస్తామని తెలిపారు. ఆక్రమణకు గురి కాకుండా సింహాచలం భూముల చుట్టూ ప్రహారీ గోడ నిర్మిస్తామన్నారు. విశాఖపట్నంను అన్ని విధాలా అభివృద్ధి పథంలో నిలుపుతామని స్పష్టం చేశారు.
Also read: Anandaiah Medicine: బుక్ చేస్తే చాలు..ఇంటికే ఆనందయ్య కరోనా మందు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook