ఎప్పుడు వివాదాస్పద, ఆసక్తికరమైన ట్వీట్స్ చేస్తూ నిరంతరం వార్తల్లో నిలిచే ప్రముఖ డైరక్టర్ వర్మ..ఈ సారి పవన్ కల్యాణ్ పై మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో జనసేన చీఫ్ ను వర్మ ఆకాశానికి ఎత్తేశారు. ఇంతకీ వర్మ ఏమన్నారంటే.. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలిస్తే ఏపీకి సీఎం అవుతారు.. ఒకవేళ గెలవకపోతే గెలిచిన సీఎంకు మొగుడవుతాడు. ఈ విషయం తనకు బ్రహ్మంగారు చెవిలో చెప్పారని సెటైర్ వేశారు . 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇదే సంరద్భంలో రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు.చంద్రబాబు తన అలవాటు ప్రకారం   పవన్ కల్యాణ్ ను  వెన్నుపోటు పొడిచారని పేర్కొన్న వర్మ.. ప్రతీకారంగా రానున్న ఎన్నికలలో పవన్ కల్యాణ్ తన నైజములో ఉన్న నిజాయితీతో చంద్రబాబును ముందుపోటు పొడుస్తాడని జోస్యం చెప్పారు..ఈ సందర్భంగా  పవన్ పవర్ మీద తనకు అత్యంత  మెగా నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు.  వర్మ చేసిన ఈ కామెంట్స్ చర్చనీయంశంగా మారాయి.