నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌ (Gudur MLA VaraPrasad) ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌ (YSRCP Mla Varaprasad)కు పెను ప్రమాదం తప్పింది. పోలీసుల కథనం ప్రకారం..  గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ చెన్నై (Chennai) నుంచి గూడూరుకి తన కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో  నాయుడు పేట వద్దకు రాగానే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కారు ముందుగా వెళ్తోన్న లారీని ఢీకొట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : AP కాకినాడ సమీపంలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం


కారు, లారీ ఢీకొన్న ఈ ఘటనలో ఎమ్మెల్యే వరప్రసాద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యేతో పాటు కారు డ్రైవర్‌ హరికి, గన్‌మన్‌కు కూడా గాయపడ్డారు. ఎమ్మెల్యే మరో వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. గాయపడ్డ డ్రైవర్, గన్‌మన్‌లను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 


Also Read : Pawan Kalyan: ‘జగనన్న విద్యా కానుక’ పేరుపై జనసేనాని అభ్యంతరం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe