AP: వీరంగం సృష్టించిన రౌడీషీటర్.. 108 దహనం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ రౌడీషీటర్ వీరంగం సృష్టించాడు. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే 108 వాహనాన్ని తగులబెట్టాడు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది.
108 ambulance burned by rowdysheeter fire: అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ రౌడీషీటర్ వీరంగం సృష్టించాడు. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే 108 వాహనాన్ని (108 ambulance) తగులబెట్టాడు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. సురేష్ అనే రౌడీషీటర్ (rowdysheeter) 108కి పదే పదే రాంగ్‌కాల్స్ చేస్తుండటంతో హెల్త్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సురేష్‌ను పోలీసు స్టేషన్‌ను తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున సురేష్ వింతగా ప్రవర్తిస్తూ హల్‌చల్ చేశాడు. పోలీస్‌స్టేషన్ కార్యాలయ అద్దాలు సైతం ధ్వంసం చేశాడు. ఈ క్రమంలో సురేష్ చేతికి గాయాలయ్యాయి. Also read: India: 50 లక్షలు దాటిన కరోనా కేసులు.. నిన్న ఒక్కరోజే 1,290 మంది మృతి
అయితే సురేష్ మానసిక పరిస్థితి బాగాలేదని గమనించిన పోలీసులు ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు 108 అంబులెన్స్‌కు కాల్ చేసి రప్పించారు. 108 ఎక్కిన సురేష్.. దానిలోని స్పిరిట్ తీసుకోని తన వద్ద ఉన్న అగ్గిపెట్టెతో వాహనానికి నిప్పుపెట్టాడు. రౌడీషీటర్ నిప్పు పెట్టి దానిలోనే ఉండటంతో పోలీసులు అతన్ని చాకచక్యంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో 108 వాహనం పూర్తిగా దగ్ధమైంది. ప్రస్తుతం రౌడీషీటర్‌ను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అతని మానసిక పరిస్థితి సరిగా లేదని పలువురు పేర్కొంటున్నారు. ఒంగోలు పట్టణంలో.. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే ఈ సంఘటన జరగడంతో.. ఇదికాస్త సంచలనంగా మారింది. Also read: Oxford COVID-19 Vaccine: క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి