అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. ముఖ్యంగా గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి, గుంటూరు, తాడేపల్లి, దుగ్గిరాల, తెనాలి, ప్రత్తిపాడు మండలాల్లో పిడుగులు పడే అవకాశం అధికంగా ఉందని ఆర్టీజీఎస్ కేంద్రం తమ హెచ్చరికల్లో పేర్కొంది.


ఆర్టీజీఎస్ హెచ్చరికల ప్రకారం జిల్లాల వారీగా పిడుగులు పడే అవకాశం వున్న ప్రాంతాల జాబితా ఇలా వుంది. 
కృష్ణా జిల్లా: బాపులపాడు, నూజివీడు, విజయవాడ, గన్నవరం, పెనమలూరు, నందిగామ, కంకిపాడు మండలాలు. 
పశ్చిమ గోదావరి జిల్లా: పోలవరం, బుట్టాయగూడెం, వేలూరుపాడు మండలాలు. 
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం, రంపచోడవరం, వైరామవరం మండలాలు. 
విశాఖ జిల్లా: కొయ్యూరు, అరకు, అనంతగిరి మండలాలు.
విజయనగరం జిల్లా: పాచిపెంట మండలం
చిత్తూరు జిల్లా: పుత్తూరు, కుప్పం, మదనపల్లె, పుంగనూరు మండలాలలో పిడుగులు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ హెచ్చరికలు జారీచేసింది.