Sajjala Ramakrishna Reddy: తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వివాదం పెరిగి పెద్దదవుతోంది. అక్రమ ప్రాజెక్టులపై ఒకరికొకరు ఆరోపణలు సంధించుకుంటున్నాయి. రెండు రాష్ట్రాల పంచాయితీ ఇప్పుడు ఢిల్లీకు కూడా చేరింది. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు (Srisailam Power Project) వివాదంతో ఏపీ, తెలంగాణల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు సంధించుకుంటున్న తరుణంలో ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం, కేఆర్ఎంబీ వద్ద వాదనలు విన్పిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అటు తెలంగాణ కూడా కేఆర్ఎంబీ సమావేశంలో తన వాదన విన్పిస్తే బాగుండేదని..సమస్య ఇక్కడే పరిష్కారమయ్యేదని అన్నారు. కేసీఆర్‌కు ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తమవరకైతే న్యాయబద్ధ హక్కు కోసం కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని సజ్జల తెలిపారు. కేఆర్ఎంబీ పక్షపాతంగా వ్యవహరిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy)విమర్శించారు. 


తెలంగాణ(Telangana)రాష్ట్రం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకు కన్పించడం లేదా అని సజ్జల నిలదీశారు. విద్యుత్ పేరుతో అక్రమంగా నీటిని నిరుపయోగం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడే ఎవరి వాటా ఏంటనేది నిర్ణయించినప్పుడు కృష్ణా జలాల్లో సగం వాటా అడగడం అసంబద్ధమన్నారు. అసలీ దుస్థితి కేవలం చంద్రబాబు (Chandrababu) వల్లనే వచ్చిందని..నాడు సమస్యను పరిష్కరించకుండా పారిపోయి వచ్చారని సజ్జల ఎద్దేవా చేశారు. 


Also read: AP Government: వీఆర్వోలకు ఇక నేరుగా పదోన్నతి, కొత్తగా విధి విధానాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook