Petrol & Diesel plastic bottles ban in AP: బాటిళ్లలో పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు బంద్‌.. ఇది ఎప్పటి నుంచో ఉంది కానీ, నిజానికి ఇలా జరగడం లేదు.. వాహనదారులు ఎప్పటిలాగే బాటిళ్లలో పెట్రోల్‌ డీజిల్‌ కొనుగోలు చేస్తున్నారు. అలాగే పెట్రోల్‌ బంకుల యజమానులు సైతం అలాగే విక్రయాలు జరుపుతున్నారు. కానీ, ఈసారి భారత ఎన్నికల సంఘం మాత్ర గట్టిగా వార్నింగ్‌ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ లోని పల్నాడులో జరగిన అల్లర్లు పెట్రోల్‌ బాంబు దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఎన్నికలు పూర్తయ్యే వరకు పెట్రోల్‌, డీజిల్‌ బాటిళ్లలో విక్రయాలు జరపకూడదని ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆదేశించింది. ఈ ఘటనలో పలువురు అధికారులపై కూడా ఈసీ వేటు వేసింది. అంతేకాదు ప్రత్యేకంగా సిట్‌ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని యోచిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిబంధనలు ఉల్లంఘించి పెట్రోల్‌ డీజిల్‌ బాటిళ్లు లేదా కంటైనర్లలో విక్రయాలు జరిపిన బంకుల లైసెన్సు సైతం రద్దు చేస్తామని ఈసీ హెచ్చరించింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయని తెలిపింది. కేవలం వాహనాలు తీసుకువస్తేనే పెట్రోల్‌ పోయాలని చెప్పింది. ఇటీవల ఏపీలో అంటే సోమవారం 13న ఎన్నికలు పూర్తయిన తర్వాత ఏపీలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పల్నాడులో పెట్రోల్‌ బాంబు దాడులు కూడా జరిగాయి. ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ సైతం విధించాల్సి వచ్చింది. ఈ ఘటనలో టీడీపీ, వైసీపీ నేతలు దాడి చేసుకున్నారు.


ఇదీ చదవండి: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఆర్జీత సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ.. డిటెయిల్స్ ఇవే..


ఈ ఘటనలో కొంత మంది రాజకీయ నేతలకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసీ తీవ్రంగా పరిగణించింది. అయితే,  వాహనదారులకు ఈ నియమం కాస్త తలనొప్పిగా మారే అవకాశం కూడా లేకపోలేదు. వాహనాల్లో పెట్రోల్‌ అయిపోతే పరిస్థితి దారుణంగా మారుతుంది. వాహనదారులు బంకుల వద్దకు తమ వాహనాలను తోస్తూ వెళ్లక తప్పేటు లేదు.


ఇదీ చదవండి:  ఏపీలోని ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు, తస్మాత్ జాగ్ర్తత్త


ఈ సందర్భంగా ఒక రాజకీయ నేత ఇంట్లో కూడా అధిక మొత్తంలో పెట్రోల్‌ బాంబులు దొరికాయి. ఇక ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయడానికి ఈసీ ఈ చర్యలు చేపట్టింది.  ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కూడా పెట్రోల్‌, డీజిల్‌ బాటిళ్లలో విక్రయాలు జరపకూడదని ఇప్పటికే పెట్రోల్‌ బంకు యజమానులకు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమించకుండా కావాల్సిన చర్యలన్ని ఈ సీ తీసుకుంటుంది. ఇది క్షేత్ర స్థాయిలో ఎంత వరకు అమలు అవుతుందో చూడాలి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter