గత వారం ప్రకాశం జిల్లాలో కలకలం రేపిన శానిటైజర్ మరణాల (Sanitiser Deaths In AP) ఘటనను మరిచిపోకముందే మరో జిల్లాలో ఇదే తరహా విషాదం చోటుచేసుకుంది. మత్తుకు బానిసై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోనూ మత్తు కోసం కొందరు మందుబాబులు ఆల్కాహాల్ శానిటైజర్‌ తాగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. కడప జిల్లా పెండ్లిమర్రిలో శానిటైజర్ తాగిన ఘటనలో మృతుల సంఖ్య (Sanitiser Deaths In Kadapa) మూడుకు చేరుకుంది. COVID19 వ్యాక్సిన్‌లో మరో ముందడుగు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొందరు నిన్న శానిటైజర్‌ తాగగా, అందులో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరికొందర్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నండగా ప్రాణాలు వదిలాడు. సోమవారం ఉదయం మరో వ్యక్తి చనిపోయాడు. మత్తుకు బానిసైన కొందరు వ్యక్తులు మద్యం ధరలు భరించలేక, లాక్‌డౌన్ ఇతర నిబంధనలతో మద్యం అందుబాటులో లేకపోవడంతో పిచ్చివాళ్లుగా ప్రవర్తిస్తున్నారు. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే.. 


జిల్లాలోని పెండ్లిమర్రిలో గత వారం రోజుల నుంచి కొందరు శానిటైజర్లు తాగుతున్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విపరీతంగా పెరిగిన మద్యం ధరల వల్ల ఇలా శానిటైజర్ తాగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారని బాధితుల కుటుంబసభ్యులు తెలిపారు. శానిటైజర్ మరణాలపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ప్రకాశం జిల్లాలో శానిటైజర్‌ తాగుతున్న ఘటనలలో ఇప్పటివరకూ మొత్తం 16 మంది చనిపోయారు. అందాల ‘దేశముదురు’ హన్సిక Photos


 India: 18 లక్షలు దాటిన కరోనా కేసులు, 38 వేల మరణాలు