ఎస్‌బీఐ ఖాతాదారులకు సరికొత్త సెక్యూరిటీ ఫీచర్ !!
నెట్ బ్యాంకింగ్ వినియోగదారులకు ఎస్ బీఐ సరికొత్త సెక్యూరిటీ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.
మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా..? ఆన్ లైన్ లావాదేవీలు చేసేందుకు మీరు నెట్ బ్యాంకింగ్ యూస్ చేస్తున్నారా..? మీ యూసర్ ఐడీ.. పాస్ పోర్ట్ చోరీ అవుతుందని చింతిస్తున్నారా..? ఊహించని సందర్భంలో అలా జరిగితే ఎప్పటిలాగా... ఇక నుంచి బ్యాంకు ప్రతినిధులను సంప్రదించకుండానే ...మీ నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని లాక్ చేయవచ్చు. అంతే కాదు..మీరు కోరినప్పడల్లా దాన్ని అన్ లాక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఎస్ బీఐ. ఈ ఫీచర్ ద్వారా లాక్ చేసుకుంటే పొరపాటున ఎవరికైనా పాస్‌వర్డ్ తెలిసినా ఖాతా నిర్వహణ సాధ్యంకాదన్నమాట. మీ అకౌంట్ సెక్రూరిటీ సంబంధించిన సరికొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి ఇలా...
మీరు చేయాల్సింది ఇదే:
Step 1: బ్యాంక్ వెబ్‌సైట్ కు వెళ్లి లాక్ అండ్ అన్‌లాక్ యూజర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి
Step 2: ఆప్షన్ పై క్లిక్ చేయగానే కొత్త విండో ఓపెన్ అవుతుంది.
Step 3 : డ్రాప్‌డౌన్ మెనూలో లాక్ యూజర్ యాక్సెస్ ఆప్షన్ ఎంచుకోవాలి.
Step 4: అందులో ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, అకౌంట్ నంబర్, క్యాప్చా వివరాలు ఎంటర్ చేయాలి.
Step 5: కొత్త పాపప్ విండో ఓపెన్ అయి మూడు పాయింట్లు కనిపిస్తాయి. వాటిని చదివి ఓకే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
Step 6: దీంతో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
Step :7: ఇలా మీ ఓటీపీ ఎంటర్ చేయగానే మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ లాక్ అవుతుంది.
ఇదిలా ఉంటే మీరు... తిరిగి అకౌంట్‌ను అన్‌లాక్ చేయాలనుకుంటే వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి లాక్ అండ్ అన్‌లాక్ యూజర్ ఆప్షన్ ఎంచుకోవాలి. యూజర్ యాక్సెస్ ఆప్షన్ ఎంచుకున్నాక మిగిలిన ప్రాసెస్ అంతా ముందులాగే ఉంటుంది. కాకపోతే ఈ సదుపాయం వ్యక్తిగత ఖాతాదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని బ్యాంకు ప్రతినిధులు పేర్కొన్నారు.