సుప్రీంలో సుబ్రహ్మణ్యస్వామికి చుక్కెదురు ; టీటీడీ పిటిషన్ తిరస్కరణ
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. టీటీడీని ఏపీ ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించాలంటూ ఆయన వేసిన పిటిషన్ ను అత్యున్నత ధర్మాసనం తొసిపుచ్చింది. టీటీడీ స్థానిక చట్టాల ఆధారంగా పనిచేస్తోంది కాబట్టి ..ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు విషయంలో హైకోర్టును ఆశ్రయిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ధర్మాసనం పేర్కొంది.
టీటీడీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఏడాది జూన్ లో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి టీటీడీని ఏపీ ప్రభుత్వం నుంచి విముక్తి చేయాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు దీన్ని తిర్కరించింది. కింది స్థాయి కోర్టులో తేల్చుకోవాలని సూచించింది. దీంతో ఈ వ్యవహారంపై సుబ్రమణ్యస్వామి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కాగా సుప్రీంకోర్టు తాజా తీర్పు ఏపీ సర్కార్ కు ఊరట నిచ్చినట్లయింది.