AP New Districts: రాయలసీమకు సముద్రం..కొత్త జిల్లాల పర్యవసానం
AP New Districts: అదేదో సినిమాలో హైదరాబాద్‌కు సముద్రం తీసుకొస్తాననేది ఓ ఎన్నికల హామీ. కానీ ఇక్కడ అసాధ్యం సుసాధ్యమైంది. తీరప్రాంతం లేని రాయలసీమకు సముద్రం వచ్చేసింది. అదెలాగో చూద్దాం..
AP New Districts: అదేదో సినిమాలో హైదరాబాద్‌కు సముద్రం తీసుకొస్తాననేది ఓ ఎన్నికల హామీ. కానీ ఇక్కడ అసాధ్యం సుసాధ్యమైంది. తీరప్రాంతం లేని రాయలసీమకు సముద్రం వచ్చేసింది. అదెలాగో చూద్దాం..
టాలీవుడ్‌కు చెందిన ఓ సినిమాలో తనకు ఓటేస్తే హైదరాబాద్‌కు సముద్రాన్ని తీసుకొస్తానని హామీ ఇస్తాడు హీరో. ఇప్పుడిక్కడ అదే జరిగింది. రాయలసీమ ప్రాంతానికి సముద్రం వచ్చేసింది. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ఏపీలో కొత్తగా ఏర్పడిన 26 జిల్లాల ఫలితమిది. జిల్లాల విభజనతో రాయలసీమ ప్రాంతంలోని భౌగోళిక స్వరూపంలో వచ్చిన మార్పు ఇది. ఇప్పటి వరకూ తీరప్రాంతమంటే..శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకూ ఉన్న ప్రాంతం. 9 జిల్లాలుండేవి. రాయలసీమలోని 4 జిల్లాలకు అసలు సముద్రమన్నది లేదు.
కానీ ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి సముద్రం వచ్చి చేరింది. రాయలసీమలోని నాలుగు జిల్లాల్ని 8 జిల్లాలుగా విభజించారు. ఇందులో నెల్లూరు జిల్లాలోని సముద్రప్రాంతం కలిగిన సూళ్లూరు పేట, గూడూరు నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో కలిశాయి. ఫలితంగా రాయలసీమ ప్రాంతానికి కూడా ఇప్పుడు సముద్రం వచ్చేసినట్టే.
ఇక మరో రెండు ఆసక్తికర పరిణామాలు కూడా చోటుచేసుకున్నాయి. గ్రేటర్ రాయలసీమ అంటూ నెల్లూరు ప్రాంతాన్ని రాయలసీమలో కలపాలనే వాదన ఉంది. జిల్లాల విభజనతో నెల్లూరు జిల్లాలోని 2 నియోజకవర్గాలు రాయలసీమలోని తిరుపతిలో కలవడంతో సాంకేతికంగా ఆ వాదన నెరవేరినట్టే. ఇక మరో ముఖ్య పరిణామం విశాఖపట్నం జిల్లా అత్యంత చిన్న జిల్లాగా అవతరించింది. అంతేకాకుండా రాష్ట్రంలో అసలు రూరల్ ప్రాంతం లేని జిల్లాగా విశాఖపట్నం నిలిచింది.
Also read: KA Paul on RGV: ఆర్జీవీపై కోర్టుకెక్కనున్న కేఏ పాల్... లీగల్ నోటీసులు పంపిస్తానని వార్నింగ్..
https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook