Gudlavalleru College: `ఏడుపొస్తొంది..చచ్చిపోవాలనిపిస్తోంది` కన్నీళ్లు తెప్పిస్తున్న గుడ్లవల్లేరు విద్యార్థుల ఆడియో
Gudlavalleru College Incident Screen Shot And Audio Leaks Goes To Viral: ఒక్క విద్యార్థిని చేసిన పాపం వందలాది మంది విద్యార్థుల వ్యక్తిగత వీడియోలను బయటకు పడేలా చేసింది. అక్కడ జరుగుతున్న పరిస్థితులు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
Gudlavalleru College Incident: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో రహస్య కెమెరాల ఉదంతం ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. ఓ విద్యార్థి చేసిన నిర్వాకంతో వందలాది మంది విద్యార్థులకు సంబంధించిన వ్యక్తిగత వీడియోలు ఉండడం తీవ్ర దుమారం రేపుతోంది. విద్యార్థినుల వ్యక్తిగత వీడియోలకు సంబంధించిన సంఘటనతో రాజకీయంగానూ తీవ్ర రచ్చ రేపుతోంది. అయితే రహాస్య కెమెరాల వీడియోలకు సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక యువతి ద్వారా ఇంతటి దారుణ పరిణామాలకు దారి తీసిందని తెలిసింది. ఒక యువతి ఓయో రూమ్‌కు వెళ్లడం ద్వారా ఇదంతా జరిగిందని తెలియడంతో అందరూ విస్తుపోతున్నారు. ఒక సీనియర్ విద్యార్థి ఒకరి చేతిలో మోసపోవడంతో వందలాది మంది విద్యార్థులను ప్రమాదంలో పడేసింది. అసలు ఏం జరిగింది? రహాస్య వీడియోలు ఎలా పెట్టారు? ఇంతకీ కారకులు ఎవరు? అనే ఆసక్తికర విషయాలు ఇలా ఉన్నాయి.
Also Read: YS Jagan: గుడ్లవల్లేరు రహాస్య కెమెరాల ఘటనపై మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే..?
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని శ్రేషాద్రి రావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలోని అమ్మాయిల వసతిగృహాల్లోని స్నానాల గదిలో రహాస్య కెమెరాలు వెలుగులోకి వచ్చాయి. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న విజయ్ ఆ కెమెరాలను ఉంచి చిత్రీకరించాడు. చిత్రీకరించిన వీడియోలను తీసి ఒక ల్యాప్‌టాప్‌లో భద్రపరిచి వాటిని ఇతరులకు పంపడం.. విక్రయించడం చేస్తున్నాడని వెలుగులోకి వచ్చింది. దీనిపై వారం రోజులుగా విద్యార్థినులు ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆందోళన చేపట్టడంతో ఒక్కసారిగా ఈ విషయం బయటకు పొక్కింది. విద్యార్థులు మీడియా ముందు వారి బాధ.. ఆవేదనను పంచుకున్నారు. తమకు సంబంధించిన 300కు పైగా వీడియోలు ఉన్నాయని తెలియడంతో విద్యార్థినులు అందరూ కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే ఇదంతా ఒక 'అక్క' ద్వారా జరిగిందిన విద్యార్థినులు మాట్లాడుకుంటున్న ఒక ఆడియోతోపాటు ఒక వాట్సప్ చాటింగ్ బయటకు వచ్చింది. ఆడియో, వాట్సప్ చాట్‌లో కనిపించింది.
Also Read: Metro Rail In AP: ఏపీకి తీరనున్న చిరకాల కల.. త్వరలో విశాఖ, విజయవాడలో మెట్రో పరుగులు
ఆడియో లీక్ ఇలా..
ఆడియో 1
'అక్క ఎవరో తెలిసింది. ఆమె నాలుగో సంవత్సరం విద్యార్థిని అంట. ఆమె ఫొటో కూడా చూశామే. ఆ అక్క అంటోంది రండి చూస్కుందాం. విత్ ప్రూఫ్‌లు కూడా ఉన్నాయని తెగేసి చెప్పేస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్.. పై ఫ్లోర్ అని ఏదేదో అంటున్నారే. భయమేస్తోంది. రెండు నెలల నుంచి పెడుతున్నారంట. 300 వీడియోలు బయటకు వచ్చాయంట' ఒక ఆడియో విడుదలయ్యింది.
ఆడియో 2
'అక్క ఏమనడం లేదు. డేర్ అండ్ డాష్‌గా రండి చూసుకుందామని చెబుతోంది. అందరూ ఏడుస్తున్నారే. మాకు భయమేస్తోంది. మా ఫ్లోర్‌లో కూడా పెట్టారంట. ఏడుపొచ్చేస్తుంది. చచ్చిపోవాలనిపిస్తుంది' అని మరో ఆడియో.
ఆడియో 3
మరో ఆడియోలో 'మేడమ్‌కు చెబితేనేమో బయటకు వస్తే డ్రగ్స్ కేసులో ఇరిక్కిస్తామని అని అలాఇలా అంటున్నారు. రవీంద్రబాబు ఏమో చూసి.. వీడియో చూసి చెబుతాడంట. నాన్ అటాచ్డ్ దాంట్లో పెట్టారంట. దేంట్లో పెట్టారో.. ఏ ఫ్లోర్ పెట్టారో తెలియదు. ఇప్పుడు 300 వీడియోలు బయటకు వచ్చాయని మాత్రం అంటున్నారు. సీనియర్స్ గొడవ పడుతున్నారు. మేడమ్స్, వార్డెన్‌లు కర్రలు పట్టుకుని వెంబడి పడుతున్నారు. కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు. 300 వీడియోలు రెండు నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్ల ఏమో పొలిటిషయన్స్ అంట. మరి తెలియట్ల. అందుకే భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి' అని ఓ విద్యార్థిని ఆవేదన.
ఆడియో 4
'ఇది ఫేక్ న్యూస్ అని అంటున్నారు. ఫేక్ న్యూస్.. చూసి చెబుతామని ఇవి అంటున్నారు' ఓ విద్యార్థిని ఆడియో
ఆడియో 5
'ప్లీజ్ ఎవరి దగ్గర అయినా వీడియో ఉందేమో కనుక్కోండి. ఇక్కడ వీడియో ప్రూఫ్ చూస్తేనే మమ్మల్ని పట్టించుకుంటారంట. లేకపోతే పట్టించుకోరంట. అది తెలిసి మాకు ఏడుపొచ్చేస్తోంది. మా ఫ్లోర్‌లోనే కెమెరా దొరికిందంట' అని ఓ విద్యార్థిని రోదిస్తూ బాధపడింది.
ఆడియో 6
'వీడియో పెడితేనే మాకు ఏదైనా చేస్తారంట. లేకుంటే ఏం చేయరంట. అడుగుతుంటే కూడా కర్రలు పట్టుకుని కొడుతున్నారే. అట్ల ఉంది మా హాస్టల్‌లో పరిస్థితి. అందరూ ఏడుస్తున్నారు
వాట్సప్ చాటింగ్ ఇదే!
ఈసీఈ నాలుగో సంవత్సరం
కాలేజీ వాళ్లు ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు
సాత్విక అంట
ఫైనల్ ఇయర్ అక్క అంట
వాళ్ల ఫాదర్ పొలిటిషియన్ అంట
వాళ్లమ్మాయి పేరు బయటకు వస్తే డ్రగ్స్ కేసు పెట్టి విచారణ చేయిస్తా అన్నారు
కాలేజ్ మూసేస్తా అని
ప్రిన్సిపల్ కూడా ఏమి అనలేదంట. మీరు ఏమన్న ఉంటే బయట చూస్కోండి అన్నాడంట. కాలేజ్ పేరు బయటకు వస్తే ఊరుకోను అన్నాడంట.
అక్క వాళ్ల బాయ్‌ఫ్రెండ్‌తో ఓయోకి వెళ్లింది అంటే వాడు వీడియో తీసి బాయ్స్ గ్రూప్‌లో పెట్టాడంట. వాళ్లు బ్లాక్‌మెయిల్ చేశారంట హాస్టల్ వాళ్ల వీడియోలు పెట్టమని ఇంక అలా చేసింది
అందరూ అడుగుతున్నా వార్డెన్స్ పట్టించుకోవట్ల అంట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook