AP Metro Rail: దేశంలోని అన్ని ప్రధాన రాష్ట్రాల్లో మెట్రో రైలు సదుపాయం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మెట్రో రవాణా సౌకర్యం లేకపోవడం శోచనీయం. పెద్ద పెద్ద నగరాలు ఏపీలో చాలా ఉన్నా రవాణాపరంగా మాత్రం వెనుకబడ్డాయి. మెట్రో కొరత వేధిస్తుండడంతో త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఏపీకి ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపట్టణంతోపాటు రాజధాని అమరావతికి సమీపాన ఉన్న విజయవాడలో మెట్రో రైలు కూత పెట్టనుంది. ఈ మేరకు ప్రభుత్వం మెట్రో రైలు నిర్మాణానికి సిద్ధమవుతున్నది. కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉండడంతో ఏపీలో మెట్రో రైలు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తోంది.
Also Read: NTR Bharosa: ఏపీ ప్రభుత్వం సంచలనం.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కన్నా ముందే పింఛన్
ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘ కాలంగా మెట్రో రైలు ఊరిస్తోంది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖపట్టణంలో మెట్రో రైలు నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయి. అయితే తర్వాత రాష్ట్ర విభజన జరగడంతో వైజాగ్‌తోపాటు విజయవాడలో కూడా మెట్రో రైలు నిర్మాణం చేయాలనే డిమాండ్ ఏర్పడింది. 2014లో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మెట్రో రైలు నిర్మాణాలపై దృష్టి సారించారు. అప్పుడు కుదరకపోవడంతో ఇప్పుడు మరోసారి మెట్రో రైలు నిర్మాణాన్ని కదిలించారు. మెట్రో కార్పొరేషన్ ఏర్పాటుచేసి మెట్రో రైలు ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Chandrababu: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం.. మీ వలన పరువు పోతుంది!
విజయవాడలో రూ.15 వేల కోట్లు, విశాఖపట్టణంలో రూ.రూ.17,100 కోట్లతో మెట్రో రైలు పనులు చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ పనులు కేంద్ర ప్రభుత్వ సహాయంతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మెట్రో విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. త్వరలోనే కేంద్ర అనుమతులతో ఏపీలో మెట్రో పనులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.
విశాఖపట్టణం మెట్రో రైలు రూట్
రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమైన విశాఖపట్టణంలో ఎప్పటినుంచో మెట్రో రైలు నిర్మాణం ఆలోచన ఉంది. ఇప్పుడు కదలిక వచ్చింది. రెండు దశల్లో మెట్రో నిర్మించనున్నారు. మొదట కొమ్మాది జంక్షన్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు, రెండో దశలో కొమ్మాది జంక్షన్ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు మెట్రో నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటి దశ 46.23 కిలో మీటర్లకు రూ.11,400 కోట్లు, రెండో దశకు రూ.5,700 ఖర్చు కానుంది.
విజయవాడ మెట్రో రైలు రూట్
ఏపీలోనే విశాఖ తర్వాత అతి పెద్ద నగరం విజయవాడ. ఇక్కడ నిత్యం లక్షల్లో ప్రజల్లో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రజా రవాణా అంతంత మాత్రమే ఉండడంతో మెట్రో రైలు అవసరం తప్పనిసరిగా మారింది. దీనికితోడు రాజధాని అమరావతి ప్రాంతం చేరువగా ఉండడంతో మెట్రోను తప్పక తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పండిట్ నెహ్రూ బస్టాండ్ ఉనంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు మెట్రో నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. రెండో దశలో అమరావతిలో నిర్మించాలనే ఆలోచన ప్రభుత్వ మదిలో ఉంది. మొదటి ఫేజ్ కోసం రూ.11 వేల కోట్లు, రెండో దశకు రూ.14 వేల కోట్లు అవసరమవుతాయని మంత్రి నారాయణ అంచనా వేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook