రాష్ట్ర విభజన అనంతరం రాజకీయలకూ దూరంగా ఉంటూ వచ్చిన లగడపాటి ఎన్నికల సర్వే పేరుతో మళ్లీ తెరపైకి వచ్చారు. లడగపాటి సర్వే ఫలితాలపై సర్వాత్రా ఉత్కంఠత నెలకొన్న నేపథ్యంలో లగడపాటి సర్వే వివరాలు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రయుఖ మీడియాతో లగడపాటి మాట్లాడుతూ ఇవన్నీ ఊహానాలుమాత్రమేనని.. తన సర్వే వివరాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. 


ఈ సందర్భంగా లగడపాటి తన పొలిటికల్ రీఎంట్రీపై మాట్లాడుతూ కొన్ని పార్టీలు తనకు పోటీచేయాలని ఆఫర్లు ఇస్తున్నారని వెల్లడించారు. తనను తెలంగాణలోని మెదక్ నుంచి పోటీ చేయమని కోరుతున్నారని....పరిస్థితులు అనుకూలిస్తే తెలంగాణ నుంచే పోటీ చేయాలని చేస్తానని లగడపాటి చమత్కరించారు. ఇదిలా ఉండగా ఆయన గనుక తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఖమ్మం...మల్లాజ్ గిరి కానీ ఎంచుకునే ఛాన్స్ ఉందని ఉహాగానాలు వినిపిస్తున్నారు. కరుడుగట్టిన సమైక్యవాదిగా ముద్రపడ్డ లగడపాటి..తెలంగాణలో పోటీ చేయాలని భావివడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.