Singapore Aid: కరోనా సంక్షోభ సమయంలో భారత్‌కు విదేశీ సహాయం అందుతోంది. ముఖ్యంగా మిత్రదేశాల్నించి అత్యవసర సేవలు అందుతున్నాయి. సింగపూర్ నుంచి భారీగా క్రయోజనిక్ ఆక్సిజన్ సముద్రమార్గం ద్వారా విశాఖకు చేరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ధాటికి ఇండియా విలవిల్లాడుతోంది. భారీగా నమోదవుతున్న కేసులతో పరిస్థితులు తలకిందులవుతున్నాయి. బెడ్స్, ఆక్సిజన్ కొరతతో పాటు అత్యవసరమందులు, వైద్య సామగ్రి సైతం అందుబాటులో ఉండటం లేదు. ముఖ్యంగా ఆక్సిజన్ కొరతతో(Oxygen Shortage) చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఈ నేపధ్యంలో ఇండియాను ఆదుకునేందుకు గత 15 రోజుల్నించి విదేశాల్నించి పెద్దఎత్తున సహాయం అందుతోంది. అమెరికా, సౌదీ అరేబియా, మలేషియా, ఫ్రాన్స్, బ్రిటన్, థాయ్‌లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాల్నించి భారీగా సహాయం వచ్చి చేరుతోంది. ఆక్సిజన్ ట్యాంకర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వైద్య సామగ్రి, అత్యవసర మందుల్ని విదేశాలు ముఖ్యంగా భారత మిత్రదేశాలు పంపిస్తున్నాయి. 


ఈ క్రమంలోనే సింగపూర్ (Singapore)నుంచి సముద్రమార్గం ద్వారా భారీగా ఇండియాకు పంపించిన సహాయం విశాఖపట్నంకు చేరింది. సముద్రసేతు పేరుతో అత్యవసర మందులు, వైద్య పరికరాలు ఇండియాకు పంపించింది సింగపూర్. ఇందులో భాగంగా ఐఎన్ఎస్ జలస్వ నౌక (INS Jalashwa) ద్వారా 18 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు(Cryogenic Oxygen Tankers), 3 వేల 650 ఆక్సిజన్ సిలిండర్లు, 39 వెంటిలేటర్లు విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కేంద్రానికి చేరాయి. ఇవే కాకుండా కోవిడ్ మందుల్ని కూడా మిత్రదేశాలు అందించాయి. సముద్రసేతు 2లో(Samudra sethu 2) భాగంగా ఈ సేవలు ఇండియాకు అందాయి.


Also read: Remdesivir Injections: రాష్ట్రంలో రెమ్‌డెసివిర్, ఐసీయూ బెడ్స్ కొరత నిల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook