Snake shocking incident viral: సాధరణంగా పాము కన్పిస్తే మనిషన్నవాడు ఎవరైన వణికిపోతాడు. దూరంగా పారిపోతారు. పాములను పట్టుకునే వాళ్లకు సమాచారం ఇస్తారు. మరికొందరు మాత్రం ధైర్యం చేసి పాముల్ని చంపుతుంటారు. కానీ చాలా మంది మాత్రం పాములకు ఆపద కల్పించకూడదని భావిస్తారు. పాముల్ని చంపితే లేని పోనీ దోషాలు చుట్టుకుంటాయని చెబుతారు. ఈ క్రమంలో పాములకు చెందిన ఒక ఘటన  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తొంది. ఆంధ్ర ప్రదేశ్ లొని శ్రీకాకుళం ఆముదాల వలసలో ఈ ఘటన చోటు చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కనిమెట్ర గ్రామంలో అర్ధరాత్రి ఒక పెద్ద తాచుపాము ఇంట్లోకి ప్రవేశించింది. దీంతో ఆ ఇంట్లో ఉంటున్నన రఘుపతి మధుసూదన్, అతని మేనల్లుడు చూశారు. పామును చూడగానే కేకలు పెట్టి .. దాని మీద గిన్నెలు, కర్రలు, కన్పించిన వస్తువులు విసిరారంట. ఇంతలో పాము.. భయపడిపోయి వాళ్ల ఇంటి ఆవరణలో ఉన్న బావిలో పడిపోయిందంట. అది గమనించిన వాళ్లిద్దరు .. ఆ బావిలోని నీళ్లను ఎవరైన తాగితే.. చనిపోతారని భయపడి.. ఒక మోటర్ తో ఆ బావిలోని నీళ్లను తోడేశారంట.


కానీ ఇంతలో ఆ మోటర్ కాస్త.. బావిలో పడిపోయిందంట. అప్పుడు.. రఘుపతి మధుసూదన్ బావిలొకి దిగేందుకు ప్రయత్నించాంట. బావిలోకి దిగి ఎంతసేపటికి బైటకు రాకపోవడంతో.. అతని మేనల్లుడు కూడా దిగాడంట. అతను కూడా పైకి రాలేదు. చివరకు ఏదో జరిగిందని... కుటుంబ సభ్యులు ఇరుగుపొరుగు వాళ్లకు చెప్పారంట.. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అగ్నిమాపక సిబ్బంది వచ్చి.. వారి డెడ్ బాడీలను బైటకు తీశారంట.


Read more: Viral Video: వామ్మో.. పెంపుడు శునకం పీక పట్టుకున్న చిరుత.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. వీడియో వైరల్..


ఈ క్రమంలో వారి డెడ్ బాడీలను పొస్ట్ మార్టంకు తరలించగా.. ఊపిరిఆడక చనిపోయారంట. కానీ అక్కడి వాళ్లు మాత్రం బావిలో పాము కాటు వేసిందని కూడా చెప్పుకుంటున్నారు. మొత్తానికి పాము ఇంట్లో ప్రవేశించి.. కాటు వేయకుండానే రెండు ప్రాణాలు తీసిందని కూడా అక్కడివాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.