వృద్ధులు,వితంతువులకు ఏపీ సీఎం చంద్రబాబు పండుగ లాంటి వార్త వినిపించారు. సామాజిక ఫించన్లు వెయ్యి నుంచి రూ.2 వేలు పెంచుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఫిబ్రవరి నుంచి దీన్ని అమలు చేస్తామని ప్రకటించారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో వెయ్యి రూపాయలు కలిపి రూ.3 వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. వృద్ధులకు సామాజిక భద్రతను మరింత పెంచేందుకే  ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా జన్మభూమి కార్యకర్రమంలో ఏపీ సీఎం పాల్గొన్నారు.ఈ సందర్భంగా చంద్రబాబు ఈ మేరకు ప్రకటన చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం వృద్ధులు,వితంతువులకు నెలకు వెయ్యి రూపాయల పించన్ ఇస్తున్నారు. దాన్ని రెండు వేలు చేయాలని నిర్ణయించారు. ఈ పెరిగిన మొత్తం వెంటనే పించన్‌దారులకు అందించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 1న వెయ్యి స్థానంలో రెండు వేల రూపాయల పించన్‌ అందనుంది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో 54 లక్షల మందికి లబ్ది పొందనున్నారు