South central railway new trains: దక్షిణ మధ్య రైల్వే కొత్తగా రెండు రైళ్లను ప్రవేశపెట్టింది. తిరుపతి భక్తుల కోసం ప్రవేశపెట్టిన కొత్త రైళ్లు ఫిబ్రవరి 7నుంచి పట్టాలకెక్కనున్నాయి. కొత్త రైళ్ల టైమ్ టేబుల్ ఇలా ఇంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తిరుపతి భక్తులు, ప్రయాణీకుల సౌకర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే ( South Central Railway ) తిరుపతి - బిలాస్‌పూర్, తిరుపతి - పూరి మధ్య రెండు కొత్త రైళ్లు ( Two special trains to Tirupati ) ప్రవేశపెట్టింది. విజయవాడ మీదుగా తిరుపతి చేరుకోనున్నాయి. తిరుపతి - బిలాస్‌ పూర్ ( Tirupati -Bilaspur )‌ ప్రత్యేక రైలు ( 07481 ) ఈ నెల 7వ తేదీ  నుంచి గురు, ఆదివారాల్లో ఉదయం 10.50 గంటలకు తిరుపతిలో బయలుదేరి..సాయంత్రం 5.50కి విజయవాడ చేరుకుని..మరుసటి రోజు సాయంత్రం 5.25 గంటలకు బిలాస్‌పూర్‌ చేరుకోనుంది. 


అదే రైలు బిలాస్‌పూర్ ( Bilaspur ) నుంచి ( 07482 ) ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మంగళ, శనివారాలలో మధ్యాహ్నం 3.35గంటలకు బయలుదేరి  మరుసటి రోజు ఉదయం 11.55కి విజయవాడ చేరుకుని, రాత్రి 10.45 గంటలకు తిరుపతి ( Tirupati ) చేరుకుంటుంది.


అదే విధంగా తిరుపతి-పూరి ( Tirupati-Puri ) మధ్య నడిచే ప్రత్యేక రైలు ( 07479 ) ఫిబ్రవరి 8వ తేదీ నుంచి సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయం 10.50 గంటలకు తిరుపతిలో బయలుదేరి, సాయంత్రం 5.50కి విజయవాడ చేరుకుని,  మరుసటి రోజు మధ్యాహ్నం 2.35 గంటలకు పూరి చేరుకుంటుంది. అదే రైలు (07480) నెంబర్ తో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి సోమ, బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో సాయంత్రం 6.30 గంటలకు పూరి ( Puri ) లో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 11.55కి విజయవాడ చేరుకుని, రాత్రి 10.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 


Also read: Investments in AP: పెట్టుబడుల్ని ఆకర్షించడంలో ఏపీ ముందంజ: కేంద్రం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook