Investments in AP: పెట్టుబడుల్ని ఆకర్షించడంలో ఏపీ ముందంజ: కేంద్రం

Investments in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. కొత్త రాష్ట్రమైనా సరే పెట్టుబడుల్ని ఆకర్షించడంలో  అగ్రస్థానంలో నిలిచిందని స్పష్టం చేసింది. సాక్షాత్తూ పార్లమెంట్ సాక్షిగా ఈ ప్రకటన వెలువడింది.

Last Updated : Feb 4, 2021, 05:50 PM IST
Investments in AP: పెట్టుబడుల్ని ఆకర్షించడంలో ఏపీ ముందంజ: కేంద్రం

Investments in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. కొత్త రాష్ట్రమైనా సరే పెట్టుబడుల్ని ఆకర్షించడంలో  అగ్రస్థానంలో నిలిచిందని స్పష్టం చేసింది. సాక్షాత్తూ పార్లమెంట్ సాక్షిగా ఈ ప్రకటన వెలువడింది.

ఆంధ్రప్రదేశ్( Andhra pradesh ) ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) బాథ్యతలు చేపట్టాక..పారిశ్రామిక వృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. సాధ్యమైనన్ని పరిశ్రమలు వస్తేనే..ఉపాధి అవకాశాలు పెరుగుతాయనేది ప్రభుత్వ  ( Ap Government ) ఆలోచన. దీనికి తగ్గట్టుగానే ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ( Central Government ) పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ.

ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడుల్ని( Investments in ap ) ఆకట్టుకోవడంలో ఏపీ ( AP ) ముందంజలో ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఏపీలో 3 ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఇవాళ అంటే ఫిబ్రవరి 4న పార్లమెంట్‌లో వెల్లడించింది. చిత్తూరు జిల్లా శ్రీసిటీతో పాటు రేణిగుంట, ఏర్పేడులో క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని తెలిపిది. పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరశింహారావు ( Bjp Mp Gvl Narasimha rao ) అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 19 ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లతోపాటు మూడు కామన్‌ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

Also read: Ap three capital issue: కర్నూలుకు హైకోర్టు తరలింపు, కేంద్ర మంత్రి వివరణ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News