Southwest Monsoon: మే నెలను తలపించిన వేసవి వేడి, తీవ్రమైన ఉక్కపోత నుంచి ఎట్టకేలకు ఉపశమనం కలగనుంది. ఎప్పుడెప్పుడా అని ఆశతో ఎదురుచూస్తున్న తొలకరి పిలుపు వచ్చేసింది. ఆలస్యంగానైనా రుతు పవనాలు ఏపీలో ఎంట్రీ ఇచ్చాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల కొద్దిరోజులుగా ఎండ వేడిమి తారా స్థాయికి చేరుకుంది జూన్ రెండవ వారంలో కూడా రోహిణీ కార్తె దాటినా సరే పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటడం ఆశ్చర్యం కల్గించింది. భారీగా ఉష్ణోగ్రతలు, వడగాల్పులు, ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. మరోవైపు జూన్ 1 నాటికి రాష్ట్రంలో ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాలు రాలేదు. చాలా ఆలస్యమయ్యాయి. కేరళ రాష్ట్రాన్నే ఈ నెల 8వ తేదీన తాకాయి. గత ఏడాదితో పోలిస్తే పది రోజులు ఆలస్యమిది. గత ఏడాది కేరళను రుతు పవనాలు మే 8వ తేదీనే తాకాయి. ఊహించినట్టే ఇవాళ ఏపీలోకి ప్రవేశించాయి. 


ఏపీలోని శ్రీహరికోట, కర్ణాటకలోని హాసన్, తమిళనాడులోని ధర్మపురి, శివమొగ్గ ప్రాంతాలపై నైరుతు రుతు పవనాలు విస్తరించాయి. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జల్లులు పడవచ్చని తెలుస్తోంది. ఈసారి దేశంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. దేశంలో వర్షపాతం రుతు పవనాలపైనే ఆదారపడి ఉండటంతో ప్రతియేటా రుతు పవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయా అనే ఆశ ఉంటుంది. ఈసారి ఆ ఆశ నెరవేరేందుకు చాలా సమయం పట్టింది. ప్రస్తుతం ఏపీలో ప్రవేశించి నైరుతి రుతు పవనాలు రాష్ట్రమంతా విస్తరించేందుకు మరో 3 రోజులు పట్టవచ్చు. రుతు పవనాలతో పాటు ఉపరితల ద్రోణి కూడా ఆవహించి ఉండటంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు, భారీ వర్షం కూడా ఉండే అవకాశాలున్నాయి.


అదే సమయంలో రుతు పవనాలు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీలోని మరి కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. రుతు పవనాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు పడవచ్చు. 


Also read: APEAPCET 2023 Results: ఏపీఎంసెట్ ఫలితాలు జూన్ 14న, ఇలా www.cets.apsche.ap.gov.in తెలుసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook