APEAPCET 2023 Results: ఏపీఈఏపీసెట్ 2023 ఫలితాలను ఎప్పుడు విడుదల చేసేది ఖరారైంది. జూన్ 14వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ఏపీఈఏపీసెట్ 2023 పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్టు అనంతపురం జేఎన్టీయూ తెలిపింది.
ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాఘాల్లో ప్రవేశానికి మే 15 నుంచి మే 23 వరకూ ఏపీఈఏపీసెట్ 2023 పరీక్షలు జరిగాయి. ఇందులో ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రవేశ పరీక్ష మే 15 నుంచి మే 19 వరకూ జరగగా, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు మే 22, 23 తేదీల్లో జరిగాయి. ఇటీవలే ఈ పరీక్షకు సంబంధించిన కీ, రెస్పాన్స్ షీట్లు విడుదలయ్యాయి. మే 24 నుంచి 26 వరకూ అభ్యంతరాలు కూడా స్వీకరించారు. మరోవైపు ఈ పరీక్షల్లో ఇంటర్మడియట్ లో విద్యార్ధులు సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజ్ కలిపి ర్యాంకులు ప్రకటిస్తారు. అన్నింటినీ క్రోడీకరించిన తరువాత జూన్ 14న అంటే మరో మూడ్రోజుల్లో ఏపీఈఏపీసెట్ 2023 పరీక్ష ఫలితాలు వెల్లడించేందుకు నిర్ణయించారు.
అనంతపురం జేఎన్టీటీయూ నిర్వహించిన ఏపీఈఏపీసెట్ 2023 ప్రవేశ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి 3.15 లక్షలమంది హాజరయ్యారు. తొలుత జూన్ 12న విడుదల చేయాలని భావించినా కొద్దిగా ఆలస్యమైంది. విద్యార్ధులు తమ ఫలితాలు, ర్యాంకు వివరాలు తెలుసుకునేందుకు నేరుగా ఈ వెబ్‌సైట్ www.cets.apsche.ap.gov.in క్లిక్ చేస్తే చాలు. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.
ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.cets.apsche.ap.gov.in.ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీపై కన్పించే AP EAMCET Results 2023 క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ వస్తుంది. ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి. అంతే మీ ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతాయి.
ఏపీఈఏపీసెట్ పరీక్షకు కటాఫ్ మార్క్స్ జనరల్, ఓబీసీ కేటగరీ విద్యార్ధులకు 45 మార్కులు కాగా, ఓబీసీ నాన్ క్రిమీలేయర్ అయితే 40 మార్కులకు, ఎస్సీలకు 35 మార్కులు, ఎస్టీలకు 35 మార్కులుగా నిర్ధారించారు.
Also read: AP Schools Summer Holidays: వేసవి సెలవులు పొడగించండి.. సీఎం జగన్‌కు టీడీపీ రిక్వెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook