Southwest Monsoon: రెమాల్ తుపాను దారి మళ్లడంతోనే భారీగా ఎండలు, తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలగనుంది. అనుకున్న సమయం మే 31 కంటే ఒకరోజు ముందే రుతు పవనాలు కేరళలో ప్రవేశించనున్నాయి. ఫలితంగా రేపు అంటే మే 31కు రాయలసీమలో ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటికే కేరళలోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తీవ్రమైన ఉక్కపోత, ఎండలతో విలవిల్లాడుతున్న ప్రజలకు, అన్నదాతలకు ఈసారి గ్రేట్ రిలీఫ్. అనుకున్న సమయం కంటే ముందే రుతు పవనాలు వచ్చేస్తున్నాయి. ఇవాళ కేరళలో ప్రవేశించి రేపు ఏపీలోని రాయలసీమను తాకనున్నాయి. జూన్ 5 నాటికి ఏపీ, కర్ణాటక, అస్సోంలోని ఇతర ప్రాంతాలకు రుతు పవనాలు విస్తరించనున్నాయి. అదే విధంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీలోని ఎగువ భాగానికి  జూన్ 10 నాటికి వ్యాపిస్తాయి. రెమాల్ తుపాను కారణంగా ఏర్పడిన పరిస్థితులు నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదిలేందుకు సహకరించాయి. కేరళలోని కొట్టాయం, ఎర్నాకులం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.


ఈసారి జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుంది. రుతుపవనాలు ముందుగానే రావడం వల్ల రోహిణి కార్తె ప్రభావం తగ్గనుంది. ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీలు తగ్గిపోనుంది. వాతావరణం చల్లగా మారి ఉక్కపోత నుంచి ఉపశమనం కలగనుంది. 


ఎల్లుండి నుంచి ఏపీలో వర్షాలు


నైరుతి రుతు పవనాలు ముందస్తుగా రావడంతో పాటు చురుగ్గా ఉండటం వల్ల ఏపీకు జూన్ 1 నుంచి వర్ష సూచన ఉంది. జూన్ 1వ తేదీన అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అనంతపురం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఇక జూన్ 2వ తేదీన విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, కడప, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. 


Also read: AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook