Ap Corona virus: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పెరుగుతున్నట్టే రాష్ట్రంలో సైతం కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. గత 24 గంటల్లో  4 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా..వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా సోకి..పరిస్థితి ఆందోళనకరంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్(Corona second wave) కోరలు చాస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అటు ఏపీలో సైతం ఇదే పరిస్థితి. రాష్ట్రంలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ ఆందోళన కల్గిస్తోంది. గత 24 గంటల్లో 35 వేల 732 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..4 వేల 157 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ  9 లక్షల 37 వేల 49 కరోనా కేసులు నమోదు కాగా.. 24 గంటల వ్యవధిలో 18 మంది మరణించారు. నెల్లూరులో నలుగురు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 7 వేల 339కు చేరుకుంది. 


రాష్ట్రంలో ప్రస్తుతం 28 వేల 383 యాక్టివ్ కేసులుండగా..గత 24 గంటల్లో 1606 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1 కోటి 55 లక్షల 34 వేల 460 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 617 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యల్పంగా 60 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో సైతం 434 కేసులు నమోదయ్యాయి. ఇక తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి(Tadikonda Mla Sridevi)కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. ప్రస్తుతం ఈమెకు హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకిన తరువాత కూడా శ్రీదేవి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. ఊపిరితిత్తుల సమస్య తీవ్రం కావడంతో శ్రీదేవిని తక్షణం ఆసుపత్రిలో చేర్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. 


Also read: Rains in ap: వేసవి నుంచి ఉపశమనం, రాష్ట్రంలో పదిరోజుల పాటు అకాల వర్షాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook